Real Estate: ఏపీలో మళ్లీ రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్ గా ఆ జిల్లాలు! అక్కడ భూముల ధరలకు రెక్కలు..!

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు మాజీ రిజిస్ట్రార్లపై హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో జస్టిస్ జి. రామకృష్ణ ఈ ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ కౌన్సిల్ డీవీ సీతారామమూర్తి, న్యాయవాది అశ్వినీకుమార్ వాదనలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. మాజీ రిజిస్ట్రార్లు వెలగపూడి ఉమామహేశ్వరరావు, కె. నిరంజన్, వడ్డాది కృష్ణమోహన్ కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతోనే ఈ చర్య చేపట్టారు.

Rains: APSDMA అలర్ట్..! 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం..!

ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల విభాగానికి చెందిన ముగ్గురు అధ్యాపకులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని 2011లో హైకోర్టును ఆశ్రయించారు. 2016లో కోర్టు వీరిని బడ్జెట్ ఖాళీలలో రెగ్యులరైజ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, అప్పటి వీసీ జి.ఎస్.ఎన్.రాజు కూడా త్వరితగతిన అమలు చేయాలని చెప్పినా, రిజిస్ట్రార్లు ఆ ఆదేశాలను నిర్లక్ష్యం చేశారు. అంతేకాకుండా ఫుల్ బెంచ్, సుప్రీంకోర్టు వరకు వెళ్లి, అక్కడ కూడా యూనివర్సిటీ వాదనలు తిరస్కరించబడ్డాయి.

Lokesh: నిమ్మల రామానాయుడు కుటుంబ వేడుకకు.. లోకేశ్!

తరచూ కోర్టు ఆదేశాలు వచ్చినా అమలు చేయకపోవడంతో, ఉద్దేశ్యపూర్వకంగా ఆదేశాలను పట్టించుకోలేదని భావించిన హైకోర్టు, ఆగస్టు 14న వ్యక్తిగత హాజరు కావాలని ఆదేశించింది. కానీ హాజరుకాకపోవడంతో చివరకు ముగ్గురు మాజీ రిజిస్ట్రార్ల అరెస్టుకు కోర్టు వారెంట్ జారీ చేసింది.

Free Bus: స్త్రీ శక్తి బస్సు ప్రయాణంలో మహిళలకు కీలక సూచనలు..! ఆ కార్డు పనికిరాదు..!
Jarkhand: జార్ఖండ్ రాజకీయాల్లో విషాదం..! విద్యాశాఖ మంత్రి కన్నుమూత..!
DMart Buying Tips: డిమార్ట్‌లో సగం కంటే తక్కువ ధరకు ఐటెమ్స్.. ₹1000 ఖర్చుతో ₹300 ఆదా.. ఇలా షాపింగ్ చేయండి!
Fastag Pass: కొత్త ఫాస్టాగ్ రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే.. వందల బదులు కేవలం ₹15 టోల్ చార్జీ!
Lokesh: లోకేశ్ ఢిల్లీ టూర్! రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర మంత్రులతో కీలక భేటీలు!
Eye: కంటి చూపును మెరుగుపరిచే ఆహారాలు.. మీ ప్లేట్‌లో తప్పనిసరిగా ఉండాల్సినవి!
Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. NDA నేతల భేటీకి హాజరు!