AP Pensions: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! నెలకు రూ.4 వేలు... లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, ఆధునికంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 1.46 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని నందివెలుగు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కలిసి లాంఛనంగా ప్రారంభించారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి కార్డులను అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

Farmers Alert: రైతులకు బిగ్ అలెర్ట్! ఈ ఒక్క నెల ఛాన్స్... త్వరపడండి!

మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 15లోగా ప్రతి ఇంటికీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్డుల ద్వారా సుమారు నాలుగు కోట్ల ప్రజలకు నేరుగా లాభం చేకూరుతుందని చెప్పారు. గుంటూరు జిల్లాలో 5.85 లక్షల మందికి, తెనాలి నియోజకవర్గంలోనే 83 వేల మందికి కార్డులు అందజేస్తున్నట్లు వివరించారు. క్యూఆర్ కోడ్ సౌకర్యం వల్ల కార్డు స్కాన్ చేసిన వెంటనే లబ్ధిదారుడు తీసుకున్న సరుకుల వివరాలు ప్రభుత్వానికి చేరతాయని, దీనివల్ల పంపిణీలో అవినీతి తగ్గుతుందని స్పష్టం చేశారు.

Red Moon: సెప్టెంబర్ 7న అస్సలు మిస్ అవ్వకండి! ఆకాశంలో అద్భుతం! దశాబ్దాల తర్వాత ఇంత ఎక్కువసేపు!

ఇక పోర్టబులిటీ విధానం వల్ల రాష్ట్రంలోని ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా దీపం-2 పథకంలో భాగంగా మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీని నిలబెట్టుకున్నట్లు పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా అందరికీ చేరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Earthquake: భారీ భూకంపం! రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత... 9 మంది మృతి!

ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ రేషన్ కార్డులు అమలు చేయడం గర్వకారణమని అన్నారు. సంక్షేమం మాత్రమే కాకుండా అభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. రూ.4 వేల పెన్షన్, తల్లికి వందనం పథకం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి జమ చేశామని గుర్తుచేశారు.

Mango Farmers: ఏపీ లో రైతులకు శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్!

అదేవిధంగా అమరావతి, పోలవరం ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులపై ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. ఎన్నికల ముందు నందివెలుగు గ్రామానికి రోడ్లు అధ్వానంగా ఉండగా, ఇప్పుడు కొత్త రోడ్లతో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. మొత్తం మీద, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సౌకర్యం, పారదర్శకత పెరగడంతో పాటు సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు అవుతాయని మంత్రులు నమ్మకం వ్యక్తం చేశారు.

Tax: ఏపీలో వాహనదారులకు గుడ్ న్యూస్! ఇకపై రోడ్ల వినియోగం ఆధారంగానే పన్ను..!
Rains: ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు..! వాతావరణ శాఖ అలర్ట్‌..!
GHMC: జిహెచ్ఎంసీ కీలక నిర్ణయం! అక్రమాలకు చెక్.. రోడ్లకు డిజిటల్ ఐడి!
Horror Journey: ఆకాశంలో పీడకలగా జరిగిన ప్రయాణం! టాయిలెట్లు పనిచేయక... బాటిళ్లలో.. నిల్చున్న చోటనే..
Jobs: నిరుద్యోగులకు గూడ్ న్యూస్! LICలో 350 ఉద్యోగాలు..! రూ.1.69 లక్షల వరకు జీతం..!
Powerful frame: పవర్ఫుల్ ఫ్రేమ.. అమెరికాకు గట్టి హెచ్చరిక.. టియాంజిన్ వేదికపై చరిత్రాత్మక క్షణం!