లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) దేశవ్యాప్తంగా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో ఎస్సీ కేటగిరీకి 51, ఎస్టీకి 22, ఓబీసీకి 88, ఈడబ్ల్యూఎస్‌కు 38, జనరల్ కేటగిరీకి 142 ఖాళీలు కేటాయించారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి 2025 ఆగస్టు 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీల వారీగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 8, 2025. జనరల్ అభ్యర్థులు రూ.700 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు మాత్రం రూ.85 ఇంటిమేషన్ ఛార్జీలు చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షలు ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 3న, మెయిన్స్ పరీక్ష నవంబర్ 8న నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.88,635 నుంచి రూ.1,69,025 వరకు జీతం లభిస్తుంది.