ఆంధ్రప్రదేశ్‌లో వాహనాల పన్నుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడింది. పబ్లిక్ రోడ్లపై నడపని వాహనాలకు పన్ను కట్టనవసరం లేదని స్పష్టం చేసింది. అంటే ప్రభుత్వ రోడ్లు, జాతీయ రహదారులపై వాహనం నడపనంతవరకు మోటారు వెహికల్ ట్యాక్స్ వసూలు చేయడం కుదరదని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
ఈ కేసు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) కు రవాణా సేవలు అందించే సంస్థతో సంబంధమైంది. ఆ సంస్థ తమ వాహనాలు కేవలం RINL ప్రైవేట్ ప్రాంగణంలోనే నడుస్తాయని, కాబట్టి పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరింది. హైకోర్టు ఈ వాదనను అంగీకరించి, సంస్థ చెల్లించిన రూ.22,71,700 పన్ను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.
ఆ నిర్ణయంపై అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లినా, హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. రోడ్లు, జాతీయ రహదారులు వాడితేనే ట్యాక్స్ కట్టాలని స్పష్టంగా చెప్పింది. ఈ తీర్పుతో ఏపీలో వాహన పన్నుపై స్పష్టత వచ్చింది.