ఇది కూడా చదవండి: Tirupathi Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్‌‌గా... టైమింగ్స్ మారాయి!

ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఆర్థిక సాయం (Financial Assistance) అందించేందుకు ఎన్డీయే (NDA) ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సారి అర్హులైనే ప్రతి రైతుకు సాయం అందజేయాలనే లక్ష్యంగా గతంలో తయారు చేసిన జాబితాను నవీకరిస్తున్నారు. అనర్హులను తొలగించడంతోపాటు అర్హులకు లబ్ధి చేకూర్చేందుకు స్పష్టమైన జాబితాను రూపొందిస్తున్నారు. ఇందుకోసం 'మనమిత్ర' యాప్ను ప్రవేశపెట్టారు. దీనిలో రైతులు పేర్లు సరిచూసుకుని లేనివారు తమ అర్హతలను ధ్రువీకరిస్తూ రైతు సేవాకేంద్రాల్లో తిరిగి అప్లోడ్ (Upload) చేయించుకోవాల్సి ఉంటుంది. గతంలో లబ్ధి పొంది ప్రస్తుతం తమ పేర్లు లేనివారు, అర్హతలుండి జాబితాలో చేరనివారికి మరో అవకాశం కల్పించారు.

ఇది కూడా చదవండి: AP Lands Registration: బ్యాడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ.. ఆ భూముల్ని రిజిస్ట్రేషన్‌ చేయరు!

ఈ నెల 13వ తేదీలోగా రైతులు వివరాలను సమర్పిస్తే పరిశీలించి జాబితాలో చేరుస్తారు. జిల్లాలో మొత్తం 5,31,369 మంది రైతులుండగా, ప్రాథమికంగా వ్యవసాయశాఖ పరిశీలన జరిపి 4,38,251 మంది అర్హుల జాబితాను రాష్ట్ర కార్యాలయానికి పంపించింది. దీనిని రియల్టైం గవర్నెన్స్ (RTGS) పరిధిలో పునఃపరిశీలన జరిపి 2,72,824 మంది రైతులు లబ్ధి పొందడానికి అర్హులని లెక్కలు తేల్చారు. వీరికి ఈకేవైసీ పూర్తిచేయాలని గ్రామ వ్యవసాయ సహాయకులకు అదేశాలిచ్చారు. ఇప్పటివరకు 2,65,272 మంది రైతులకు ఈకేవైసీ పూర్తిచేశారు. అందుబాటులో ఉన్న మిగిలిన రైతులకు కూడా ఈకేవైసీ పూర్తి చేయనున్నారు.

ఇది కూడా చదవండి: Silver prices: వెండి ధరలు రికార్డు స్థాయికి... ట్రేడర్ల ఆనందం మామూలుగా లేదు!

పథకానికి ప్రభుత్వ భూమి సాగుదారులు అనర్హులు. డీకేటీ పట్టాదారులు, అసైన్డ్, ఇనాం భూములున్నవారు అర్హులు. దేవాదాయ భూముల్లో సాగుచేస్తున్నవారికి కౌలురైతులతోపాటు మొత్తం లబ్ధి రెండు విడతల్లో అక్టోబరు, జనవరిలలో అందిస్తారు. పథకం లబ్ధి కుటుంబంలో ఒకరికి మాత్రమే అందిస్తారు. వేరే కుటుంబం వారైతే గ్రామవార్డు సచివాలయం (Village Ward Secretariat) నుంచి కుటుంబ సర్వే పూర్తిచేయించుకోవాలి. రైతు భూమి వెబ్ ల్యాండ్లో వేరొక ఆధార్తో అనుసంధానం చేసి ఉంటే సంబంధిత రెవెన్యూ సిబ్బందిని కలిసి సరైన ఆధార్ను అనుసంధానించుకోవాలి.

ఇది కూడా చదవండి: BR Naidu TTD: అమెరికాలోని బర్మింగ్ హామ్ లో వరల్డ్ పోలీస్ గేమ్స్-2025! అభినందించిన బీఆర్ నాయుడు!

తప్పు ఆధార్తో అనుసంధానం చేసి ఉన్నా, చనిపోయినవారి భూమి మ్యుటేషన్ జరగాల్సి ఉన్నా, వెబ్యాండ్లో ఆధార్కు జత కాలేదని గుర్తించినా ఇతర కారణాలున్నా సంబంధిత వీర్వోను సంప్రదించి సరిచేసుకున్న తరువాత రైతు సేవా కేంద్రానికి వెళ్లి వ్యవసాయ సహాయకుని ద్వారా దరఖాస్తు చేయాలి. ఇప్పటివరకు జిల్లాలో 1,410 మంది దరఖాస్తు చేయగా, 69 మంది రైతుల వివరాలు సంబంధిత తహశీల్దారు పరిశీలనకు పంపించినట్లు జేడీఏ ఎస్.శ్రీనివాసరావు (S. Srinivasa Rao) తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయం పన్ను చెల్లింపుదారులు, ఒకే కుటుంబంలో ఒకరికి మించి పేర్లు, పింఛనుదారులుంటే అనర్హులని తెలిపారు.

జిల్లాలోని మొత్తం రైతులు: 5,31,369

ప్రాథమిక పరిశీలనలో గుర్తించింది: 4,38,251

ఆర్టీజీఎస్ (RTGS) పరిశీలనలో నిర్థారించింది: 2,72,824

దరఖాస్తుకు ఇచ్చిన గడువు: ఈ నెల 13

ఇప్పటివరకు అందిన అర్జీలు: 1,410

తహశీల్దార్ల పరిశీలనకు పంపినవి: 69

ఇది కూడా చదవండి: Amaravati Express Highway: అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Ahmedabad flight: విమాన ప్రమాదంపై అప్పుడే ఓ నిర్ణయానికి రావొద్దు.. ప్రాథమిక నివేదికపై కేంద్ర మంత్రి!

Liquor Scam Case: సిట్ విచారణకు డుమ్మా కొట్టిన విజయసాయిరెడ్డి! 11 మందిని సిట్ అధికారులు అరెస్ట్!

Chandrababu Gift: చంద్రబాబు ఆదేశాలతో ఆ నలుగురు చిన్నారులకు సైకిళ్లు అందజేత! రూ.52 వేలు బ్యాంకు ఖాతాలో..

Employment News: ఆ ఉద్యోగస్తులకు ప్రభుత్వం శుభవార్త! కేబినెట్ సబ్ కమిటీ పలు మార్లు!

Godavari River: గంట గంటకు పెరుగుతున్న గోదావరి... లోతట్టు ప్రాంతాల ప్రజలుకు హెచ్చరిక!

Visa: అమెరికా వీసా దరఖాస్తుదారులకు షాక్... అదనపు ఫీ ఎంత అంటే!

Substations: ఆ జిల్లాకు మూడు కొత్త సబ్ స్టేషన్లు మంజూరు! ఎస్‌ఈ శ్రవణ్ కుమార్ ప్రకటన!

Job offers: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీర్లకు గ్లోబల్ అవకాశాలు! శిక్షణతో పాటు ఉద్యోగం!

RTC Offer: ఆర్టీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ. 450తో 6 అమ్మవారి క్షేత్రాలను చూడొచ్చు!

 Hero Prabhas: ఫస్ట్ టైం కన్నీళ్లు పెట్టుకున్న ప్రభాస్! కారణం తెలిస్తే అవాక్కవుతారు!

Donald Trump: ట్రంప్ కొత్త బిల్లు ఎఫెక్ట్..! భారతీయ విద్యార్థులకు, టూరిస్టులకు అమెరికా షాక్!

Ration Card Holders: వారెవ్వా.. 18 నుంచి 35 ఏళ్ల లోపు వారికి భారీ గుడ్ న్యూస్! రేషన్ కార్డు ఉంటే చాలు!

Dwacra Womens: ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్..! రూ.30వేలు, రూ.12వేలు చొప్పున డిస్కౌంట్, త్వరపడండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group