Tolywood: పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. జాతకాలను నమ్మను! ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే..! Duvvada Madhuri: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి.. పవర్‌ఫుల్ పాత్రతో సినీ ఆరంగేట్రం! స్టార్ హీరోయిన్ చేతుల మీదుగా.. Darling movie: రీ-రిలీజ్‌లోనూ ప్రభాస్ ప్రభంజనం.. 3 రోజుల్లోనే రూ. 10 కోట్ల మార్కును దాటేసిన 'డార్లింగ్'! Rajamouli: మాహిష్మతికి పునాది అక్కడే పడింది.. చిచెన్ ఇట్జా పిరమిడ్ స్ఫూర్తిని వెల్లడించిన జక్కన్న.. Tollywood: ఒకవైపు కేసు.. మరోవైపు అషు రెడ్డి వార్నింగ్.. అసలేం జరిగింది? Akshay Kumar: భయపడని నిటార.. కటకటాల్లోకి నిందితుడు! స్టార్ కిడ్ మనోధైర్యాన్ని మెచ్చుకున్న పోలీసులు.. Rajamouli: వారణాసి మేకింగ్ చూసి ఫిదా అయిన జక్కన్న - చిత్ర బృందంపై ప్రశంసల జల్లు! Agadha: 45 నిమిషాల వీఎఫ్ఎక్స్ హంగులతో.. విజువల్ వండర్‌గా రాబోతున్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్.. Mangli: నిజం త్వరలోనే బయటకు వస్తుంది.. ఇన్వెస్టర్ల సొమ్ము మాయం కేసులో మంగ్లీ క్లారిటీ.! Dimple Hayathi: మెగా ఆఫర్ కొట్టేసిన డింపుల్.. చిరు నెక్స్ట్ మూవీలో కీలక పాత్ర! Tolywood: పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. జాతకాలను నమ్మను! ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే..! Duvvada Madhuri: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి.. పవర్‌ఫుల్ పాత్రతో సినీ ఆరంగేట్రం! స్టార్ హీరోయిన్ చేతుల మీదుగా.. Darling movie: రీ-రిలీజ్‌లోనూ ప్రభాస్ ప్రభంజనం.. 3 రోజుల్లోనే రూ. 10 కోట్ల మార్కును దాటేసిన 'డార్లింగ్'! Rajamouli: మాహిష్మతికి పునాది అక్కడే పడింది.. చిచెన్ ఇట్జా పిరమిడ్ స్ఫూర్తిని వెల్లడించిన జక్కన్న.. Tollywood: ఒకవైపు కేసు.. మరోవైపు అషు రెడ్డి వార్నింగ్.. అసలేం జరిగింది? Akshay Kumar: భయపడని నిటార.. కటకటాల్లోకి నిందితుడు! స్టార్ కిడ్ మనోధైర్యాన్ని మెచ్చుకున్న పోలీసులు.. Rajamouli: వారణాసి మేకింగ్ చూసి ఫిదా అయిన జక్కన్న - చిత్ర బృందంపై ప్రశంసల జల్లు! Agadha: 45 నిమిషాల వీఎఫ్ఎక్స్ హంగులతో.. విజువల్ వండర్‌గా రాబోతున్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్.. Mangli: నిజం త్వరలోనే బయటకు వస్తుంది.. ఇన్వెస్టర్ల సొమ్ము మాయం కేసులో మంగ్లీ క్లారిటీ.! Dimple Hayathi: మెగా ఆఫర్ కొట్టేసిన డింపుల్.. చిరు నెక్స్ట్ మూవీలో కీలక పాత్ర!

Tolywood: పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. జాతకాలను నమ్మను! ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే..!

ప్రముఖ సినీ నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్ న్యూట్రిషనిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా దివ్య సత్యరాజ్ తన వ్యక్తిగత జీవితం, సామాజిక కట్టుబాట్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సంప్రదాయాలకు భిన్నంగా ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలు నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలకు వేదికయ్యాయి.

Published : 2026-04-28 12:43:00
  • తాళి కట్టడం వంటి ఆచారాల వల్లే బంధం బలపడుతుందనే విషయాన్ని తాను నమ్మనన్న దివ్య..
     
  • Cinema: పిల్లలను కనేందుకు పెళ్లి తప్పనిసరి అనే నిబంధనను వ్యతిరేకిస్తున్నానన్న దివ్య..

ప్రముఖ నటుడు సత్యరాజ్ కుమార్తె, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ దివ్య సత్యరాజ్ తన వ్యక్తిగత జీవితం మరియు సామాజిక సంప్రదాయాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో వేళ్లూనుకున్న కట్టుబాట్లకు భిన్నంగా ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలు నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలకు దారితీశాయి. తాళి కట్టడం లేదా ఉంగరాలు మార్చుకోవడం వంటి ఆచారాల వల్లే దంపతుల మధ్య బంధం బలపడుతుందని తాను ఏమాత్రం నమ్మనని ఆమె స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తులు మనస్పూర్తిగా ఇష్టపడితే కలిసి ఉండటానికి పెళ్లి అనే సామాజిక ముద్ర అవసరం లేదని, పరస్పర అవగాహనే బంధానికి పునాది అని ఆమె పేర్కొన్నారు.

ముఖ్యంగా సంతానం విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. పిల్లలను కనాలంటే వివాహం తప్పనిసరి అనే నిబంధనను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు దివ్య వెల్లడించారు. పెళ్లి చేసుకోకుండానే తల్లిని కావడానికి తాను సిద్ధంగా ఉన్నానని, జీవితంలో అది తన వ్యక్తిగత నిర్ణయమని ఆమె కుండబద్దలు కొట్టారు. ఆధునిక కాలంలో మహిళలు ఆర్థికంగా, మానసికముగా స్వతంత్రంగా ఎదుగుతున్న వేళ, పాతకాలపు పద్ధతులే పాటించాలనే ఒత్తిడి సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. తన మనసుకు నచ్చినట్లు జీవించడమే తన ప్రాధాన్యత అని, ఎవరి కోసమో తన ఆలోచనలను మార్చుకోనని ఆమె ధీమాగా చెప్పారు.

తన తండ్రి సత్యరాజ్ నాస్తికుడు కావడంతో తన పెంపకం కూడా ఎంతో స్వేచ్ఛగా సాగిందని దివ్య వివరించారు. తనకు జాతకం కూడా రాయించలేదని, గ్రహగతులు మన జీవితాన్ని శాసిస్తాయనే నమ్మకం తనకు లేదని స్పష్టం చేశారు. తాను పెళ్లి చేసుకున్నా లేదా ఒంటరిగా ఉండిపోయినా తన సంతోషమే తండ్రికి ముఖ్యమని, తన నిర్ణయాలను ఆయన ఎప్పుడూ గౌరవిస్తారని గర్వంగా వెల్లడించారు. తండ్రి ఇచ్చిన ఈ స్వేచ్ఛే తనను స్వతంత్రంగా ఆలోచించేలా చేసిందని ఆమె పేర్కొన్నారు.


 

Spotlight

Read More →