Gold prices Today: "పసిడి ప్రియులకు తీపి కబురు": ఒక్కసారిగా దిగివచ్చిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు భారీ ఊరట! UIDAI: UIDAI సంచలన నిర్ణయం... ఇకపై వాటికి ఆధార్ చెల్లదు! Free Petrol: పెట్రోల్ కొరత వేళ భారీ ఊరట - లీటర్ పెట్రోల్ ఉచితంగా పోస్తున్న బంకు యజమాని! Delhi Flight: జ్యూరిచ్ ప్రయాణంలో ఉత్కంఠ.. సాంకేతిక లోపంతో అర్ధరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం.. Oil Crisis: ఏపీలో ఇంధన సెగ.... డీజిల్ కొరతతో స్తంభించిన రవాణా! ఆటోకు రూ.200, కారుకు రూ.500 మాత్రమే! RBI Latest Update: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు... ఎందుకంటే! RBI: ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు మరి యూపీఐ పనిచేస్తుందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Gold prices Today: "పసిడి ప్రియులకు తీపి కబురు": ఒక్కసారిగా దిగివచ్చిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు భారీ ఊరట! UIDAI: UIDAI సంచలన నిర్ణయం... ఇకపై వాటికి ఆధార్ చెల్లదు! Free Petrol: పెట్రోల్ కొరత వేళ భారీ ఊరట - లీటర్ పెట్రోల్ ఉచితంగా పోస్తున్న బంకు యజమాని! Delhi Flight: జ్యూరిచ్ ప్రయాణంలో ఉత్కంఠ.. సాంకేతిక లోపంతో అర్ధరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం.. Oil Crisis: ఏపీలో ఇంధన సెగ.... డీజిల్ కొరతతో స్తంభించిన రవాణా! ఆటోకు రూ.200, కారుకు రూ.500 మాత్రమే! RBI Latest Update: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు... ఎందుకంటే! RBI: ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు మరి యూపీఐ పనిచేస్తుందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం!

Visakhapatnam: విశాఖలో ఏఐ విప్లవానికి నాంది.. భారత్ డిజిటల్ గేట్‌వేగా.. -జీత్ అదానీ!

Visakhapatnam: విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన అనంతరం అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ జీత్ అదానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్‌తో భారత్ ఏఐ రంగంలో ఒక పెద్ద ముందడుగు వేసిందని ఆయన పేర్కొన్నారు.

Published : 2026-04-28 12:07:00

కంప్యూట్ రంగంలో ఈ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంతో విశాఖ అత్యంత ముఖ్యమైన పాత్ర..

ముంబై, చెన్నైలోనే పరిమితమైన డేటా సెంటర్ లు ఇక విశాఖలోకి అడుగు పెట్టాయి..

విశాఖపట్నం: విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన అనంతరం అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ జీత్ అదానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్‌తో భారత్ ఏఐ రంగంలో ఒక పెద్ద ముందడుగు వేసిందని ఆయన పేర్కొన్నారు.

1 గిగావాట్ సామర్థ్యంతో నిర్మించబడుతున్న హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ దేశానికి కొత్త దిశను చూపనుందని చెప్పారు. కంప్యూట్ రంగంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించడంతో పాటు విశాఖపట్నం నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురానుందని అన్నారు.

ఇప్పటి వరకు ముంబై, చెన్నై వంటి నగరాల్లో మాత్రమే పరిమితమైన డేటా సెంటర్లు ఇప్పుడు విశాఖలోకి రావడం ఒక పెద్ద మార్పు అని జీత్ అదానీ పేర్కొన్నారు. “ఇకపై విశాఖ భారతదేశానికి ఒక కొత్త డిజిటల్ గేట్‌వేగా మారుతుంది” అని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ ఏఐ డేటా సెంటర్ ద్వారా భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాలతో కనెక్టివిటీ పెరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి దూరదృష్టి ఉన్న నాయకత్వం వల్లే డిజిటల్ మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన ప్రశంసించారు.

“విశాఖ నగరం ఏఐ రివల్యూషన్‌కు నాంది పలికింది. భవిష్యత్తులో ఈ నగరం టెక్నాలజీ రంగంలో కీలక కేంద్రంగా ఎదుగుతుంది” అని జీత్ అదానీ అన్నారు. అదానీ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని వెల్లడించారు.

ప్రజలకు, వ్యాపార రంగానికి, పరిశ్రమలకు అధునాతన ఏఐ సేవలను అందించడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌తో విశాఖపట్నం మాత్రమే కాదు… మొత్తం దేశం డిజిటల్ మార్గంలో మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Spotlight

Read More →