Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Tirumala Latest Update: శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత కలకలం... భక్తులకు టీటీడీ కీలక సూచనలు! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Tirumala Latest Update: శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత కలకలం... భక్తులకు టీటీడీ కీలక సూచనలు!

Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల!

Tirumala: మే 2026 నెలలో తిరుమల క్షేత్రంలో జరగబోయే విశేష పర్వదినాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. మే 1న కూర్మ జయంతి మరియు గరుడ సేవ, మే 2న అన్నమాచార్య జయంతి, మే 12న హనుమజ్జయంతి వంటి ముఖ్యమైన ఉత్సవాలు జరగనున్నాయి. నెల ఆఖరులో నమ్మళ్వార్ ఉత్సవాలతో తిరుమల ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది.

Published : 2026-04-26 18:45:00

Devotional- తిరుమలలో మే నెల ఉత్సవాల సందడి…

అంజనాద్రిపై హనుమజ్జయంతి వేడుకలు…

వేసవి రద్దీ మరియు ఉత్సవాల నేపథ్యంలో తిరుమలలో భక్తులకు టీటీడీ సూచనలు…

Tirumala: కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో మే నెలలో పలు విశేష పర్వదినాలు, ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మే నెలకు సంబంధించిన ఉత్సవాల క్యాలెండర్‌ను విడుదల చేసింది. భక్తులు తమ ప్రయాణాలను, దర్శన సమయాలను ఈ పండుగల తేదీలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. ప్రధానంగా మే 1వ తేదీన పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గరుడ సేవ భక్తులకు కనువిందు చేయనుంది.

ఈ నెలలో ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన కూర్మ జయంతి మే 1న జరగనుంది. అదే రోజు రాత్రి స్వామివారు గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. మే 2వ తేదీన పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి ఉత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. అన్నమయ్య సంకీర్తనలతో తిరుమల గిరులు మారుమోగనున్నాయి. మే 3న పరాశర భట్టర్ వర్ష తిరు నక్షత్రం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మే నెలలో మరో అతి ముఖ్యమైన పండుగ హనుమజ్జయంతి. మే 12వ తేదీన అంజనాద్రి ఆకాశగంగ క్షేత్రంలో హనుమంతుని జన్మదిన వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరపనున్నారు. హనుమజ్జయంతి సందర్భంగా తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో సుందరకాండ పారాయణాలు, ప్రత్యేక పూజలు భక్తులను అలరించనున్నాయి.

నెల ఆఖరులో వైష్ణవ సంప్రదాయంలో విశిష్టమైన నమ్మళ్వార్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మే 21న నమ్మళ్వార్ ఉత్సవాల ఆరంభం కాగా, మే 30న నమ్మళ్వార్ శాత్తుమొర కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. మధ్యలో మే 26వ తేదీన వరదరాజస్వామి వర్ష తిరు నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

వేసవి సెలవుల దృష్ట్యా మే నెలలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని, ఈ విశేష ఉత్సవాల సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ పండుగ విశేషాలను గమనించి, తదనుగుణంగా తమ పర్యటనను సిద్ధం చేసుకోవాలని కోరారు.

Spotlight

Read More →