మాల్టాలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు..
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు..
యూరప్ దేశమైన మాల్టాలో నివసిస్తున్న తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు లతా ముల్లపూడి అధ్యక్షత వహించగా, స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు, చంద్రబాబు నాయుడు దేశ అభివృద్ధికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పురోగతికి చేసిన కృషిని గుర్తు చేశారు. దూరదృష్టి, పరిపాలనా నైపుణ్యం, సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి లక్షణాలు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని కొనియాడారు.
ఈ వేడుకల్లో ముల్లపూడి లతా–మురళి, రవి రాజు సాగి, షేక్ అజరుద్దీన్, సతీష్ ముల్లపూడి, నరేష్ తలపనేని, చాగంటి బ్రహ్మ, సుమంత్ బాబు, పి. వేణుగోపాల్, సుధీర్ రెడ్డి, శ్రీనాథ్ చావా, మహేష్, రణధీర్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం 69 మంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలియజేశారు.