వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోక్సో కేసులో బాధితురాలి పేరు ప్రస్తావించడంపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. దీంతో గోరంట్ల మాధవ్‌పై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా బుధవారం హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఈరోజు విచారణకు హాజరయ్యేందుకు గోరంట్ల మాధవ్ భారీగా జన సందోహంతో వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే సెక్షన్ 35/3 బిఎన్ఎస్ఎస్ కింద గోరంట్ల మాధవ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: నేడు విశాఖ, ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన! రాత్రి విశాఖ పార్టీ కార్యాలయంలో..
కాగా వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్‌కు విజయవాడ సైబర్ క్రైం పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోక్సో కేసులో బాధితుల వివరాలను మీడియా సమావేశంలో ఆయన బహిరంగంగా వెల్లడించారంటూ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ గత ఏడాది నవంబరు 2న ఫిర్యాదు చేశారు. దీంతో మాధవ్‌పై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు బీఎన్‌ఎస్ 72, 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విజయవాడ నుంచి వారు అనంతపురం వచ్చి మాధవ్ నివాసానికి వెళ్లారు. ఈ కేసులో మార్చి 5న విజయవాడలో విచారణకు రావాలని సూచించారు. విజయవాడ పోలీసులు ఆయన ఇంటికి వచ్చారని, అరెస్టు చేయబోతున్నారని ప్రచారం జరగడంతో మాధవ్ అనుచరులు, వైసీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నారు. అయితే పోలీసులు నోటీసులు మాత్రమే ఇచ్చి వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!
వైజాగ్ ప్రజలు ఆందోళన.. ఏన్నో యేళ్ల చరిత్ర ఉన్న విశాఖ లైట్ హౌస్ ను కూల్చేస్తారా.?
తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్! 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్లడి!
రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...
గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..
వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?
వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?
తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: