Minister: జగన్ నీ పద్ధతి మార్చుకో..! మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్!

-By చప్పిడి రాజశేఖర్,
కో ఆర్డినేటర్, NRI TDP Cell,
మాజీ డైరెక్టర్ APNRTS

Bangladesh Plane Crash: బంగ్లాదేశ్ విమాన ప్రమాదంలో 19కి పెరిగిన మృతుల సంఖ్య...! కూలిపోయింది చైనా తయారీ విమానం!

ప్రవాసాంధ్రులు సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం పొందే భాగ్యం. ఏపీఎన్ఆర్టీఎస్ (APNRTS) (ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ) అధ్యక్షుడు రవి వేమూరి నేతృత్వంలో, ఆ సంస్థ ప్రతినిధులు ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రవాసాంధ్రులకు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కోటా పెంచాలంటూ విన్నవించుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ కోటా రోజుకు 50 టికెట్లుగా ఉండేది.

Free Bus Scheme: మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు పథకంలో ‘జీరో ఫేర్ టిక్కెట్’.. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి!

అయితే వైకాపా పాలనలో దాన్ని 10కి తగ్గించడంతో విదేశాల నుంచి వచ్చే శ్రీవారి భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి టీటీడీ (TTD)కి రోజుకు 100 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇవ్వాలని సూచించారు.

World Cup: హంపీ విజయం స్ఫూర్తిదాయకం.. శాప్ ఛైర్మన్ ప్రశంసల వర్షం!

అయితే బ్లూ మీడియా మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విష ప్రచారం చేస్తుంది. శ్రీవాణి దర్శనాలు, సుపదం దర్శనాలు ఉండగా కొత్తగా VIP బ్రేక్ దర్శనాలు అవసరమా అంటూ పలు బ్లూ మీడియా పత్రికల్లో ప్రచారం జరుగుతుంది. అసలు ఎన్నారైల (NRI)కు బ్రేక్ దర్శనాలు ఎందుకు ఇవ్వాలి అనే విషయానికి వస్తే ఎన్నారైలు వివిధ దేశాలలో పని చేసుకుంటూ అక్కడ సంపాదనను భారత్ కు పంపుతారు. ఆ రెమిటెన్స్ ధనం సంవత్సరానికి దాదాపు రూ. 40 వేల కోట్ల రూపాయల ఆదాయం ఆంధ్రప్రదేశ్ కు వస్తుంది. దానితో వారి కుటుంబ సభ్యుల లైఫ్ స్టాల్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి మరింత మెరుగు పడుతుంది.

Adaptive Learning: ఏపీలో వినూత్న కార్యక్రమం..! చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఏఐ బోధన!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే కంపెనీ లకు మన ప్రభుత్వం జీరో టాక్స్, తక్కువ ఖర్చుతో భూములు, రోడ్ లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తుంది. కానీ ఇలాంటి ప్రోత్సాహకాలు ఏమీ లేకుండా పుట్టిన ఊరును, కుటుంబాన్ని వదిలి ఎక్కడో కష్టపడుతూ ఎన్నారైలు పంపించే ఆ ధనం మన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ఎంతో సహాయపడుతుంది. అలాంటి వారికి ఎన్ని రాయితీలు కల్పించినా తక్కువే.

Intercity Express: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఆ రైలుకు అదనపు బోగీలు..! ఇక నో టెన్షన్..!

ఇప్పుడు చూస్తున్న కేరళ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైల సహకారం ఎంతో ఉంది. అలాగే ఫిలిప్పీన్స్, బాంగ్లాదేశ్, శ్రీలంక, చైనా వంటి దేశాల ఆర్ధిక వ్యవస్థలో కూడా ఇతర దేశాల్లో పని చేసుకుంటున్న ఆ దేశాల పౌరులు కీలక పాత్ర పోషిస్తారు అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు.

Highway Extension: కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఆ 15 జిల్లాల రహదారులకు మారనున్న రూపురేఖలు!

ప్రస్తుతం ఎన్నారైలకు రూ. 300 సుపదం టికెట్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి కేవలం ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఎన్నారైలకే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలకు అందుబాటులో ఉంటాయి. కాని సీఎం చంద్రబాబు గారు ఏపీఎన్నార్టీఎస్ ద్వారా కల్పిస్తున్న VIP బ్రేక్ దర్శనాలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎన్నారైలకు మాత్రమే. అంతే కాకుండా ఈ సుపదం దర్శనానికి వెళ్లాలంటే ఎన్నారైలు భారత్ కు వచ్చిన తేదీ నుండి 30 రోజులలోపు మాత్రమే అర్హులు. 30 రోజులు దాటితే ఈ దర్శనానికి అర్హులు కారు.

Outsourcing wages: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం – మున్సిపల్ ఔట్సోర్సింగ్ వేతనాలకు పెంపు

ఎన్నారైల రెమిటెన్స్ ను పెంచేందుకు, పెట్టుబబడులు పెట్టేలా వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇస్తున్న సహకారం. అలాగే విదేశాలలో ఉంటూ పని చేసుకునే ప్రతి ఒక్కరు ధనవంతులు మాత్రమే ఉంటారని ఖచ్చితంగా చెప్పలేము. డొమెస్టిక్ వర్కర్ లు, బ్లూ కాలర్ వర్కర్లు వంటి వారు ఎందరో రూ. 10 వేలు కట్టి శ్రీవాణి దర్శనానికి వెళ్ళలేరు. ఇవన్నీ తెలియని కొన్ని బ్లూ మీడియా గ్రేట్ పత్రికలు కూటమి ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారు.

New Ration Cards: సామాన్యులకు గుడ్ న్యూస్! ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డులు!

దర్శనాల విషయానికి వస్తే ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో టీటీడీ బోర్డు రోజుకు కేవలం 25 టికెట్లు మాత్రమే ఇస్తోంది. కానీ ఆగస్టు నెలలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ కోటాను 50 టికెట్లకు పెంచే అవకాశముందని అంచనా వేస్తున్నారు. క్రమేణా ఇది 100 కు పెరిగే అవకాశం ఉంది. ఇలా ఎన్నారైలకు రోజుకు 100 VIP బ్రేక్ దర్శనాలు కల్పించడంపై ఎన్నారై లు అందరూ హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు. 

Green Card: అభివృద్ధికి అడ్డుగా వలస నిబంధనలు..! గ్రీన్ కార్డు జాప్యం మరోసారి కెరీర్ పై దెబ్బ!

ఈ సేవను పొందాలనుకునే ప్రవాసాంధ్రులు ముందుగా https://apnrts.ap.gov.in/ వెబ్‌సైట్‌ కి వెళ్లి ఉచితంగా సభ్యత్వం నమోదు చేసుకోవాలి. నమోదు సమయంలో వారు ఉన్న దేశానికి సంబంధించిన వీసా, వర్క్ పర్మిట్, రెసిడెన్స్ ప్రూఫ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వివరాలు ఇవ్వాలి. వెబ్‌సైట్‌లో మూడు నెలల శ్రీవారి దర్శన స్లాట్లు కనిపిస్తాయి. అందులో తమకు కావాల్సిన తేదీకి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. భక్తుల రద్దీ ఆధారంగా టీటీడీ టికెట్లను కేటాయిస్తుంది. టికెట్లు లభించిన వారికి తిరుమలలోని ఏపీఎన్ఆర్టీఎస్ పీఆర్వో ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. మరిన్ని వివరాలకు ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 

Permanent Building: అమరావతిలో తొలి శాశ్వత భవనం రెడీ..! ఆరోజే ఈ ప్రభుత్వ కార్యాలయ ప్రారంభోత్సవం!
Missile Manufacturing Unit: ఏపీలో క్షిపణి తయారీ యూనిట్‌? DRDO బృందం స్థలాల పరిశీలన... ఆ జిల్లా దశ తిరిగినట్లే!
Green Power Capital: దేశానికి గ్రీన్ పవర్ క్యాపిటల్‌గా అమరావతి… ప్రపంచం కన్ను ఏపీపై!
Gold rates: పసిడి దూసుకుపోతుంది… లక్ష దాటిన బంగారం ధరలు!
AP Farmers: ఏపీ రైతులకు శుభవార్త! పంట వేయకముందే... ఎకరాకు రూ.84 చెల్లిస్తే రూ.42 వేలు, హెక్టారుకు రూ.1.05 లక్షలు!
UIDAI కొత్త ప్రాజెక్ట్.. ఇక స్కూళ్లలోనే ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.. కోట్లాది పిల్లల కోసం!
Tirumala: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌…! క్యుఆర్‌ కోడ్స్‌తో అసలు విషయం చెప్పేయొచ్చు!
Free Meditation: ఏపీలో స్కూల్ విద్యార్థులకు పూర్తిగా ఉచితం..! ప్రతి రోజూ రెండు పూటలా, కీలక నిర్ణయం!