ఈ రోజు బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. ఇప్పటికే పసిడి ధరలు లక్ష రూపాయలను దాటి సామాన్య ప్రజలకు అందని స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.110 పెరిగి రూ.1,00,150కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.91,800గా నమోదైంది.
మరోవైపు వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా కేజీకి రూ.1,26,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇదే రేంజ్‌లో ధరలు కొనసాగుతున్నాయి. బంగారం ధరలు ఇలాగే పెరుగుతుండడంతో సాధారణ వినియోగదారులు కొనుగోలు విషయంలో వెనుకంజ వేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో బంగారం కొనుగోలుదారులకు ఇది ఆర్థికంగా భారంగా మారిన పరిస్థితి.