Unemployed Youth: ఏపీలో యువతకు అద్భుతమైన ఛాన్స్! రూ.లక్ష నుంచి రూ.50 లక్షలు ఇస్తారు... వెంటనే దరఖాస్తు చేస్కోండి!

తిరుమలలో శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు మరో ప్రయత్నం చేస్తోంది. భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకుని సేవలను మెరుగుపరుస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో ముందుకు సాగుతోంది. తిరుమలలో శ్రీవారి భక్తులకు అందించే సేవలను విస్తృతం చేస్తోంది. ఇప్పటికే అందిస్తున్న సేవలను మెరుగుపర్చడానికి కృషిచేస్తోంది. శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలో భక్తుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఏడుకొండలవాడి దర్శనం కోసం వచ్చే భక్తుల నుంచి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు అభిప్రాయ సేకరణ విధానాన్ని అమలు చేస్తోంది.

UIDAI కొత్త ప్రాజెక్ట్.. ఇక స్కూళ్లలోనే ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.. కోట్లాది పిల్లల కోసం!

భక్తుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రత్యక్షంగా పరోక్ష పద్ధతులను ఉపయోగిస్తోంది. ఇప్పుడందిస్తున్న సేవలకు అదనంగా ఎలాంటి సేవలు ఆశిస్తున్నారో తెలుసుకుంటోంది. ఇందుకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ విధానం, మొబైల్ సందేశం ద్వారా సర్వేలు, శ్రీవారి సేవకుల ద్వారా ప్రత్యక్ష సర్వేలను ప్రారంభించి భక్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటోంది. విద్యుదయిత సర్వే విధానం ద్వారా భక్తులు తిరుమల యాత్ర పూర్తి అనుభవాన్ని తెలియజేస్తున్నారు. అన్న ప్రసాదం, కల్యాణకట్ట, శ్రీవారి ఆలయం, వసతి, క్యూ లైన్ల నిర్వహణ, లగేజ్ కౌంటర్లు పై మొత్తం 16 అంశాలపై ప్రశ్నావళిని రూపొందించి సర్వే నిర్వహిస్తోంది. కృత్రిమ మేధస్సు సహాయ సాంకేతికతను కూడా అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది.

Gaza: ఆహార పంపిణీ కేంద్రం వద్ద కాల్పులు..! గాజాలో 90 మందికి పైగా మృత్యువాత!

మొబైల్ సందేశం ద్వారా అభిప్రాయాల సేకరణ కోసం తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ సంకేతాలను మొబైల్‌తో స్కాన్ చేస్తే చాలు అభిప్రాయం తెలిపే అవకాశం కల్పించింది. భక్తులు అభిప్రాయాల కోసం ప్రత్యేకంగా 9399399399 అనే నంబర్‌ను ప్రవేశపెట్టింది. ఈ నంబర్‌పై అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. భక్తులు తమ పేరు, విభాగం ఎంపిక చేసి అభిప్రాయం చెప్పే అవకాశం ఉంటుంది. అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూ లైన్, గదులు ఇలా పలు అంశాలను ఎంచుకుని అభిప్రాయం ఇవ్వొచ్చు.

AP Farmers: ఏపీ రైతులకు శుభవార్త! పంట వేయకముందే... ఎకరాకు రూ.84 చెల్లిస్తే రూ.42 వేలు, హెక్టారుకు రూ.1.05 లక్షలు!

మరోవైపు శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ కూడా చేపట్టింది. సేవకులు నేరుగా భక్తులను కలిసి సేవలందుతున్న తీరు, మెరుగుకోసం చేపట్టాల్సిన చర్యలపై అభిప్రాయాలు తీసుకుంటున్నారు. త్వరలోనే మొబైల్ యాప్, బుకింగ్ సైట్ నుంచి కూడా భక్తుల విలువైన సలహాలు సూచనలు తీసుకోవడానికి అప్లికేషన్ రూపొందించనుంది. ఈ విధానాల ద్వారా భక్తులు తమ అభిప్రాయాలను తెలియజేసి సేవలను మెరుగుపరచేందుకు తోడ్పడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తోంది.

Six marriages: పబ్ సింగర్ బాగోతం బయటకు… ఏడేళ్లలో ఆరు పెళ్లిళ్లు!
Thalliki Vandanam Program: తల్లులకు గుడ్ న్యూస్.. ఆ విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం! డబ్బులు జమ.. చెక్ చేసుకోండి!
Supreme Court: వైసీపీకి టెన్షన్...టెన్షన్! ఆ కేసు పై సుప్రీమ్ తీర్పు... ఏమిటంటే!
Mumbai Train Blasts: ముంబై సబర్బన్ రైళ్లలో పేలుళ్ల కేసు..! 12 మందిని నిర్దోషులుగా ప్రకటించిన బాంబే హైకోర్టు!
Consecutive holidays: పాఠశాలలకు సెలవుల పండుగ… మూడు రోజులు క్లాసులుండవు... ఎందుకో తెలుసా!