జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల వరల్డ్ కప్‌లో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి సెమీ ఫైనల్‌కు చేరుకోవడం హర్షణీయమని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్‌లో సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి ఇండియన్‌గా సాధించిన ఘనత హంపీకే దక్కుతుందన్నారు.
ఈ మేరకు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీకి శాప్ ఛైర్మన్ అభినందనలు తెలియజేశారు. ఈ లీగ్‌లో చేరిన తొలి భారతీయ మహిళ కోనేరు హంపి కావడం తెలుగు ప్రజలకు గర్వకారణని, ఆమె విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. కాగా ఫిడే మహిళల వరల్డ్ కప్‌లో ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో కోనేరు హంపీ 1.5-0.5 తేడాతో చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్‌పై విజయం సాధించారన్నారు.