Missile Manufacturing Unit: ఏపీలో క్షిపణి తయారీ యూనిట్‌? DRDO బృందం స్థలాల పరిశీలన... ఆ జిల్లా దశ తిరిగినట్లే!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలి శాశ్వత భవనం పనులు ముగింపు దశకు వచ్చాయి. తొలి భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. అమరావతిలో రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఆగష్టు 15 నాటికి సిద్ధం చేయాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Green Power Capital: దేశానికి గ్రీన్ పవర్ క్యాపిటల్‌గా అమరావతి… ప్రపంచం కన్ను ఏపీపై!

రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రధాన కార్యాలయం శాశ్వత భవనం ఆగష్టు 15న ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాయపూడిలో సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన ఈ శాశ్వత భవనం నిర్మాణం జరుగుతోంది. ఈ మేరకు తొలి శాశ్వత భవనం ప్రారంభోత్సవానికి ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తే రాజధాని నగర పాలన మరింత సులువు అవుతుందని భావిస్తున్నారు.

APNRTS TTD Tickets: ఎన్నారైలకు 100 టీటీడీ బ్రేక్ దర్శనాలు ఎప్పటినుంచి అంటే! ఆ అవకాశం ఎందుకంటే!

ఈ శాశ్వత భవనం పనులు అనుకున్న సమయానికి పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఈ మేరకు మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతేడాది అక్టోబరు 19న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పునర్నిర్మాణ పనులను ఇక్కడి నుంచే ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పుడు చంద్రబాబు చేతుల మీదుగా ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Gold rates: పసిడి దూసుకుపోతుంది… లక్ష దాటిన బంగారం ధరలు!

ఇప్పుడు ఆ పనులు ముగింపు దశకు వచ్చాయంటున్నారు. ఆగస్టు 15కు ప్రారంభించాలని భావిస్తుండటంతో ఆ పనుల్ని మరింత వేగవంతం చేశారు అధికారులు. ఈ శాశ్వత కార్యాలయం కోసం ఈ భవనాన్ని దాదాపు 3.62 ఎకరాల్లో ఏడు అంతస్తులతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యాలయం మొత్తం నిర్మాణ విస్తీర్ణం 2.42 లక్షల చదరపు అడుగులు.

Free Meditation: ఏపీలో స్కూల్ విద్యార్థులకు పూర్తిగా ఉచితం..! ప్రతి రోజూ రెండు పూటలా, కీలక నిర్ణయం!

ఈ భవనం గ్రౌండ్ అంతస్తులో సమ్మిళిత కమాండ్ కంట్రోల్ గదిని ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా అమరావతి నగరంలోని ట్రాఫిక్, భద్రత, పారిశుద్ధ్యం, వరదలు వంటి వాటిని సమీక్ష చేయొచ్చు. ఈ శాశ్వత కార్యాలయ భవనం అందుబాటులోకి వస్తే.. ప్రస్తుతం విజయవాడలో ఉన్న కార్యాలయాన్ని మున్సిపాలిటీలలో పేదరూపంలో నివసించే ప్రజల కోసం ఉన్న మిషన్‌కు అప్పగించాలని నిర్ణయించారు.

Tirumala: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌…! క్యుఆర్‌ కోడ్స్‌తో అసలు విషయం చెప్పేయొచ్చు!
Unemployed Youth: ఏపీలో యువతకు అద్భుతమైన ఛాన్స్! రూ.లక్ష నుంచి రూ.50 లక్షలు ఇస్తారు... వెంటనే దరఖాస్తు చేస్కోండి!
UIDAI కొత్త ప్రాజెక్ట్.. ఇక స్కూళ్లలోనే ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.. కోట్లాది పిల్లల కోసం!
Gaza: ఆహార పంపిణీ కేంద్రం వద్ద కాల్పులు..! గాజాలో 90 మందికి పైగా మృత్యువాత!
AP Farmers: ఏపీ రైతులకు శుభవార్త! పంట వేయకముందే... ఎకరాకు రూ.84 చెల్లిస్తే రూ.42 వేలు, హెక్టారుకు రూ.1.05 లక్షలు!