ఈ రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడం చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, రసాయన పదార్థాల వాడకం వలన జుట్టు త్వరగా తెల్లబడుతోంది. దీని నుంచి బయటపడటానికి చాలామంది కెమికల్ డైలు, షాంపూలు వాడుతారు. కానీ అవి తాత్కాలిక ఫలితాలు ఇచ్చినా, భవిష్యత్తులో జుట్టుకు హానికరంగా మారతాయి.
ప్రసిద్ధ హెయిర్ ఎక్స్‌పర్ట్ జావేద్ హాబీబ్ ఈ సమస్యను సహజంగా తగ్గించడానికి సులభమైన మార్గాన్ని సూచించారు. ఆయన ప్రకారం ఖరీదైన ఉత్పత్తులు అవసరం లేదు, క్రమపద్ధతిలో సరైన హెయిర్ కేర్ రొటీన్ పాటిస్తే చాలనారు. దీన్నే ప్రీ-కండిషనింగ్ పద్ధతి అంటారు. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచి, తెల్లబడకుండా కాపాడుతుంది.
ప్రీ-కండిషనింగ్‌లో నాలుగు దశలు ఉంటాయి. మొదటగా జుట్టును నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత సున్నితంగా నూనె రాసి తేలికగా మసాజ్ చేయాలి. ఆ నూనెను అరగంట వరకే ఉంచాలి. చివరగా సహజ క్లెన్సర్‌లతో, అంటే షీకాకై లేదా కుంకుడుకాయలతో జుట్టును శుభ్రం చేసుకోవాలి.
తలకు నూనెను ఎక్కువసేపు ఉంచితే చుండ్రు, దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే రసాయనాలతో నిండిన షాంపూలు వాడకుండా సహజ పదార్థాలతోనే కడగడం మంచిది. ఇలా చేయడం వలన జుట్టులో సహజ తేమ నిలిచి, దెబ్బతినకుండా బలంగా ఉంటుంది.
ఈ పద్ధతిని క్రమంగా పాటిస్తే జుట్టు ఎప్పుడూ మెరిసేలా, నల్లగా ఉంటుంది. తెల్ల జుట్టు తగ్గిపోవడమే కాకుండా, జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు కూడా తగ్గుతాయి. ఇది ప్రతి ఒక్కరూ ఇంట్లోనే తక్కువ ఖర్చుతో పాటించగల సులభమైన సహజమైన పద్ధతి.