RTC Health Boost: తిరుపతిలో ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఆధునిక డిస్పెన్సరీ..! వేల కుటుంబాలకు లబ్ధి..!

జున్ను తెలియని వారు బహుశా నేటి సమాజంలో ఎవ్వరూ ఉండరు ఏమో. కాకపోతే తరచుగా జున్ను తినకపోవచ్చు. కొంతమంది అయితే అధిక ధర పెట్టి జున్నుపాలను కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ మధ్యకాలంలో జున్ను పాలు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. 

UIDAI: ఆధార్ కార్డు అప్‌డేట్‌ ఇక ఒక్క క్లిక్‌తో..! నవంబర్‌ 1 నుంచి కొత్త సిస్టమ్ అమల్లోకి..!

జున్ను రుచి మాత్రం అస్సలు మర్చిపోలేరు. ఆవు లేదా గేదె ఈనిన తర్వాత వచ్చే మూడు రోజుల్లో వచ్చే పాలనే జున్ను పాలు అంటారు. ఈ తొలి పాలను ఉడికించి చేసే ఈ జున్ను, పల్లె వంటింటి ప్రత్యేకత. పాత తరం దీన్ని ఆరోగ్యానికి మంచిదని చెప్పినప్పటికీ, ఆధునిక పరిశోధనలు కూడా అదే చెబుతున్నాయి జున్ను అంటే నిజంగా సూపర్ ఫుడ్ అని నిపుణులు అంటున్నారు.

Pregnancy healthy tips: తల్లి పోషకాహారమే బిడ్డ ఎదుగుదలకు పునాది – గర్భిణులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!!

ఆవు లేదా గేదె నుంచి తొలి మూడు నాలుగు రోజుల్లో వచ్చే పాలలో ప్రోటీన్‌, కాల్షియం‌, విటమిన్లు విపరీతంగా ఉంటాయి. అందుకే సాధారణ పాలకంటే జున్నులో మూడు రెట్లు ఎక్కువ పోషకాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సరిపోయే సహజ ఆహారం.

Supreme Court CJI : జస్టిస్ సూర్యకాంత్‌నే తదుపరి సీజేఐగా సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు – కేంద్రానికి జస్టిస్ గవాయ్‌ లేఖ!!

జున్నులో ఉన్న ప్రోటీన్‌ కండరాలకు బలం ఇస్తుంది. వ్యాయామం చేసే వారికి ఇది సహజ ఎనర్జీ సప్లిమెంట్‌లా పనిచేస్తుంది. అంతేకాదు, ఇందులోని విటమిన్లు, మినరల్స్‌ మెదడు కణజాలాన్ని ఉత్తేజపరచి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మరో మెగా ప్రాజెక్ట్‌.. రూ.1.47 లక్షల కోట్లతో శ్రీకారం! ఏ జిల్లాలో అంటే ?

కాల్షియం పుష్కలంగా ఉండే జున్ను ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. పెరుగుతున్న పిల్లలకైనా, వయసులో పెద్దవారికైనా ఇది సరైన ఆహారం. ఎముకల బలహీనత, దంతాలకు జున్ను అద్భుతమైన పోషక విలువలను అందిస్తుంది.

Land Rules: ఇక ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..! భూమి మార్పిడి ఒక్క క్లిక్‌తో..!

ఫైబర్‌ మరియు మంచి బ్యాక్టీరియా సమతౌల్యం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులో ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అదీ కాక, ఇందులోని కొన్ని పోషకాలు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! అక్కడ నెలకు రూ.లక్ష ... 90శాతం రాయితీ!

జున్ను తినేటప్పుడు జాగ్రత్తలు

RTC: ప్రయాణం సురక్షితం అని భరోసా ఇస్తున్న తెలంగాణ ఆర్టీసీ.. ఏసీ పల్లె వెలుగు బస్సుల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి!

అన్ని ఆహారాల్లాగే దీనికీ కొంత జాగ్రత్త అవసరం. ఉడకని జున్ను తినడం వలన ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంటుంది. వేడి వాతావరణంలో అయితే ఫ్రిజ్‌లో నిల్వ చేయడం మంచిది. అలాగే అధిక కొలెస్ట్రాల్‌ ఉన్నవారు పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

America illegal Migrants: అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం… 54 మంది భారతీయులను స్వదేశానికి పంపిన అధికారులు! అధికంగా ఆ రాష్ట్రం వారే!!

ముఖ్యంగా గుర్తుంచుకోవాలి — దొరికింది కదా అని అధికంగా తినడం మంచిది కాదు. మితంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Gold mining : వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం అతి ఎక్కువ బంగారం కలిగిన దేశాలు ఇవే!!

జున్ను తయారు చేసే విధానం

ముఖ్య గమనిక! మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో 28, 29 తేదీలలో కార్యక్రమాలు రద్దు!

కావలసిన పదార్థాలు:

Home Minister Anita warns: తుపాన్ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ అంతా అలర్ట్.. హోంమంత్రి అనిత హెచ్చరిక!

జున్ను పాలు

New Centers: APలో జిల్లాల పునర్విభజన తుది దశలో..! ఆరు కొత్త కేంద్రాలకు గ్రీన్ సిగ్నల్!

సాధారణ పాలు

Praja Vedika: నేడు (27/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

బెల్లం

IPS officer Sajjanar: IPS అధికారి సజ్జనార్ హెచ్చరిక.. నా పేరుతో వచ్చే మెసేజులు నమ్మొద్దు!

యాలకులు

మిరియాలు

తయారీ విధానం:

1. ముందుగా జున్ను పాలను ఒక గిన్నెలో తీసుకోండి.

2. ఒక గ్లాసు జున్ను పాలకు రెండు గ్లాసుల సాధారణ పాలు కలపాలి.

3. యాలకులు, మిరియాలు కాస్త దంచి ఆ మిశ్రమంలో వేయాలి.

4. బెల్లం వేసి కాసేపు కలుపుతూ ఉండాలి.

5. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, ఆ గిన్నెను కొంచెం నీరు ఉన్న పెద్ద గిన్నెలో ఉంచి, మూత పెట్టి 45 నిమిషాలు మధ్య మంటపై ఉడికించాలి.

6. తరువాత జున్ను చల్లారిన తర్వాత రుచి చూడండి – ఆరోగ్యవంతమైన పల్లె రుచిని ఆస్వాదించండి!

గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా తీసుకోవాలంటే, ముందుగా మీ వైద్యుని సంప్రదించడం మంచిది.