కన్నడలో దర్శన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన హీరోగా రూపొందిన 'కాటేరా' డిసెంబర్ 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఏడాది చివర్లో వచ్చినప్పటికీ, క్రితం ఏడాదిలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. 200 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది.'సలార్' బరిలో ఉండగా ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడం విశేషం. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ 5వారు సొంతం చేసుకున్నారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. కన్నడతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా జగపతిబాబు నటించడం విశేషం. ఇక మరో ముఖ్యమైన పాత్రలో వినోద్ కుమార్ నటించాడు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందనేది చూడాలి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group