⚡ BREAKING

135వ మన్ కీ బాత్లో ప్రధాని మోదీ సందేశం.. ప్రజా భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని పిలుపు!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 135వ మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి పలు కీలక అంశాలపై మాట్లాడారు. నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు, కాలుష్య నియంత్రణ, పేదలకు కేంద్ర పథకాల ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ, యువతలో క్రీడా స్ఫూర్తి పెంపు వంటి అంశాలను ప్రస్తావించారు.

PM Modi
PM Modi

పర్యావరణ పరిరక్షణ, ప్రజారవాణా వినియోగం, స్వదేశీ తయారీపై ప్రధాని కీలక వ్యాఖ్యలు..

ట్రాఫిక్ తగ్గించండి.. ప్రజారవాణా పెంచండి: మన్ కీ బాత్లో మోదీ సూచనలు..

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 135వ మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి పలు కీలక అంశాలపై మాట్లాడారు. నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు, కాలుష్య నియంత్రణ, పేదలకు కేంద్ర పథకాల ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ, యువతలో క్రీడా స్ఫూర్తి పెంపు వంటి అంశాలను ప్రస్తావించారు.

నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రజలు సహకరించాలని ప్రధాని మోదీ కోరారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించాలని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, కార్ల వినియోగాన్ని తగ్గించడం ద్వారా ట్రాఫిక్తో పాటు కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చని తెలిపారు.

కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని పేర్కొన్న ప్రధాని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలను పేద ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన వంటి పథకాలు ప్రజలకు భరోసా కల్పిస్తున్నాయని తెలిపారు.

ప్రజలు మూఢనమ్మకాలను వదిలి శాస్త్రీయ విజ్ఞానం, అవగాహన పెంచుకోవాలని ప్రధాని కోరారు. ప్రకృతి, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

అసోంలో కనిపించే అరుదైన హర్గీలా పక్షులను కొంతమంది అశుభ సూచకంగా భావించడం సరికాదని ప్రధాని పేర్కొన్నారు. పక్షులు, జీవరాశులను రక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని తెలిపారు.

మన్ కీ బాత్లో ప్రధాని మోదీ నాగాలాండ్లో నిర్వహిస్తున్న చిన్నారుల ఫుట్బాల్ లీగ్ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. 5 నుంచి 12 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు ఈ లీగ్లో పాల్గొంటున్నారని తెలిపారు.

నాగాలాండ్ చిన్నారులు క్రీడలపై ఆసక్తి చూపుతూ దేశంలోని ఇతర ప్రాంతాల యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. యువత క్రీడలను కూడా కెరీర్గా ఎంచుకుని కష్టపడాలని సూచించారు.

యువతలోని సృజనాత్మకతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని తెలిపారు. యువత తమ ప్రతిభను వెలికితీసేందుకు క్రీడలు, నూతన ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

స్వదేశీ తయారీని ప్రోత్సహించడం దేశ అభివృద్ధికి ఎంతో ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలు దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. తన పిలుపు తర్వాత ప్రజల్లో బంగారం కొనుగోళ్ల విషయంలో మార్పు వచ్చిందని, అవసరమైన వాటినే కొనుగోలు చేసే ఆలోచన పెరిగిందని ప్రధాని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రజల భాగస్వామ్యం, బాధ్యతాయుతమైన జీవన విధానం, స్వదేశీ ఆలోచన ఎంతో అవసరమని మోదీ స్పష్టం చేశారు.

Tags

Be the first to react

Latest