డీజిల్ ఎగుమతి ధరలు పెంచిన కేంద్రం! ప్రజలకు ఖుషి కబురు!

Petrol Diesel Tax Update: అంతర్జాతీయంగా చమురు ధరల్లో చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పెంచింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త పన్ను రేట్లను ప్రకటించింది. అయితే పెట్రోల్ ఎగుమతులపై మాత్రం ఎలాంటి పన్ను విధించలేదు. సవరించిన పన్ను రేట్లు నవంబర్ 16 నుంచి అమల్లోకి వచ్చాయి.

Centre Hikes Windfall Tax on Diesel Exports
Centre Hikes Windfall Tax on Diesel Exports
  • కేంద్రం ఇంధన ఎగుమతులపై కీలక మార్పులు చేసింది.. కొత్త పన్ను రేట్లు ప్రకటించింది.
  • ఒకదానిపై భారీగా పన్ను పెంచగా.. మరొకదానికి మాత్రం మినహాయింపు ఇచ్చిం

Petrol Diesel Tax Update: అంతర్జాతీయంగా చమురు ధరల్లో చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పెంచింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త పన్ను రేట్లను ప్రకటించింది. అయితే పెట్రోల్ ఎగుమతులపై మాత్రం ఎలాంటి పన్ను విధించలేదు. సవరించిన పన్ను రేట్లు నవంబర్ 16 నుంచి అమల్లోకి వచ్చాయి. 

డీజిల్‌పై ఎంత పెరిగిందంటే?
కేంద్రం తాజా నిర్ణయంతో డీజిల్ ఎగుమతులపై విధించే ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (SAED) లీటరుకు రూ.11.50 నుంచి రూ.14కు పెరిగింది. అంటే లీటరుకు రూ.2.50 అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

విమాన ఇంధనంపైనా అదనపు భారం

విమానాల్లో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై కూడా పన్నును పెంచింది. గతంలో లీటరుకు రూ.11గా ఉన్న పన్నును తాజాగా రూ.12.50కు చేర్చింది. మరోవైపు పెట్రోల్ ఎగుమతులపై పన్నును మాత్రం సున్నాగానే కొనసాగించింది. 

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?
కేంద్రం పెంచిన ఈ పన్నులు కేవలం ఎగుమతులకు మాత్రమే వర్తిస్తాయి. దేశీయంగా విక్రయించే పెట్రోల్, డీజిల్‌పై ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ సుంకాల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఈ నిర్ణయం వల్ల నేరుగా దేశీయ వినియోగదారులపై అదనపు పన్ను భారం పడదు. 

ఎగుమతి పన్నులు ఎందుకు పెంచుతోంది?
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో దేశీయంగా ఇంధన లభ్యతను కాపాడేందుకు కేంద్రం ఈ విధానాన్ని అమలు చేస్తోంది. విదేశీ మార్కెట్లలో అధిక ధరలు ఉన్నప్పుడు కంపెనీలు పెద్ద మొత్తంలో ఇంధనాన్ని ఎగుమతి చేయకుండా నియంత్రించడం కూడా దీని ఉద్దేశం.

పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనంపై ఎగుమతి సుంకాలను కేంద్రం ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలను పరిశీలించి అవసరాన్ని బట్టి పన్ను రేట్లలో మార్పులు చేస్తుంది. అక్టోబర్ 31న కూడా డీజిల్, ATF ఎగుమతి పన్నులను కేంద్రం పెంచిన విషయం తెలిసిందే.

Tags

Be the first to react

Latest