⚡ BREAKING

IPS Siva Prasad: జాతీయ స్థాయిలో ఆంధ్రుడి సత్తా.. అస్సాంలో సంచలనాలు సృష్టిస్తున్న ఐపీఎస్ శివప్రసాద్!

గతంలో అస్సాం రాష్ట్రాన్ని కుదిపేసిన 73 ఏళ్ల వృద్ధ వైద్యుడు డాక్టర్ దేవేందన్ దత్తా మూకదాడి (లించింగ్) హత్య కేసును శివప్రసాద్ కేవలం 21 రోజుల్లోనే చేధించి సంచలనం సృష్టించారు. సాధారణంగా మూకదాడి కేసులలో బలమైన ఆధారాలు లేక నిందితులు తక్కువ శిక్షలతో తప్పించుకుంటుంటారు. కానీ ఈ కేసులో ఎటువంటి ప్రత్యేక చట్టం లేకపోయినప్పటికీ, 602 పేజీల పక్కా చార్జ్షీట్తో 26 మందికి యావజీవ శిక్ష, ఒకరికి ఉరిశిక్ష పడేలా చేశారు. సాక్షులను బెదిరించే ప్రమాదం ఉండటంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 'విట్నెస్ ఐడెంటిటీ కన్సీల్మెంట్' పద్ధతి ద్వారా సాక్షులకు కొత్త పేర్లు, అడ్రసులు ఇచ్చి రహస్యంగా విచారణ జరిపించి విజయం సాధించారు.

జాతీయ స్థాయిలో ఆంధ్రుడి సత్తా
జాతీయ స్థాయిలో ఆంధ్రుడి సత్తా
  • 21 రోజుల్లోనే డాక్టర్ దత్తా మూకహత్య కేసు చేధన.. 26 మందికి యావజీవ శిక్ష, ఒకరికి ఉరి

  • భారతదేశంలోనే తొలిసారి: సాక్షుల పేర్లు మార్చి రహస్య విచారణ జరిపిన 'సూపర్ కాప్'

  • అమెజాన్, ఫ్లిప్కార్ట్ గుట్టురట్టు చేసిన ఏపీ అధికారి.. గ్లోబల్ ఈ-కామర్స్ రంగంలో ప్రకంపనలు

IPS Siva Prasad: జాతీయ స్థాయిలో ఆంధ్రుడి సత్తాను చాటుతూ, పోలీసింగ్ వ్యవస్థలో సరికొత్త చారిత్రాత్మక విజయాలు సాధిస్తున్నారు ఐపీఎస్ అధికారి డాక్టర్ జి.వి. శివప్రసాద్. సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయిన ఈయన, ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో ఐజీ (ఇన్స్పెక్టర్ జనరల్) గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేవలం నేరస్తులను పట్టుకోవడమే కాకుండా, పక్కా శాస్త్రీయ మరియు ఫారెన్సిక్ ఆధారాలతో కోర్టులలో నేరాన్ని నిరూపించి బాధితులకు న్యాయం చేయడంలో ఈయన దేశవ్యాప్తంగా అరుదైన అధికారిగా గుర్తింపు పొందారు. సీనియర్ హోదాలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు 18 సంచలన కేసులను స్వయంగా దర్యాప్తు చేసి, అన్నింటిలోనూ నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేశారు.

గతంలో అస్సాం రాష్ట్రాన్ని కుదిపేసిన 73 ఏళ్ల వృద్ధ వైద్యుడు డాక్టర్ దేవేందన్ దత్తా మూకదాడి (లించింగ్) హత్య కేసును శివప్రసాద్ కేవలం 21 రోజుల్లోనే చేధించి సంచలనం సృష్టించారు. సాధారణంగా మూకదాడి కేసులలో బలమైన ఆధారాలు లేక నిందితులు తక్కువ శిక్షలతో తప్పించుకుంటుంటారు. కానీ ఈ కేసులో ఎటువంటి ప్రత్యేక చట్టం లేకపోయినప్పటికీ, 602 పేజీల పక్కా చార్జ్షీట్తో 26 మందికి యావజీవ శిక్ష, ఒకరికి ఉరిశిక్ష పడేలా చేశారు. సాక్షులను బెదిరించే ప్రమాదం ఉండటంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 'విట్నెస్ ఐడెంటిటీ కన్సీల్మెంట్' పద్ధతి ద్వారా సాక్షులకు కొత్త పేర్లు, అడ్రసులు ఇచ్చి రహస్యంగా విచారణ జరిపించి విజయం సాధించారు.

అస్సాంలోనే రికార్డు సృష్టించిన మరో సంచలన 'అభినీల్ లించింగ్' (అభిజిత్ నాథ్, నీలోత్పల్ దాస్) మూకహత్య కేసును కూడా శివప్రసాద్ కేవలం 33 రోజుల్లో దర్యాప్తు ముగించి 828 పేజీల అభియోగ పత్రాన్ని కోర్టుకు సమర్పించారు. నిందితుల తరపున అస్సాంలోనే అత్యంత ప్రతిష్టాత్మక క్రిమినల్ లాయర్ ఎనిమిదేళ్ల పాటు గట్టిగా పోరాడినప్పటికీ, శివప్రసాద్ సేకరించిన తిరుగులేని శాస్త్రీయ ఆధారాల ముందు నిలబడలేకపోయారు. దీనితో కోర్టు ఈ కేసులో 20 మంది నిందితులకు యావజీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. క్లిష్టమైన కేసులను అతి తక్కువ కాలంలోనే శాస్త్రీయంగా ముగించడం ఈయన ప్రత్యేకత.

కేంద్ర డిప్యూటేషన్పై 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' (CCI) లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన సమయంలో శివప్రసాద్ గ్లోబల్ బిజినెస్ రంగంలోనే అతిపెద్ద 'యాంటీ ట్రస్ట్' దర్యాప్తును చేపట్టారు. ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ (Amazon) మరియు వాల్మార్ట్ అనుబంధ సంస్థ ఫ్లిప్కార్ట్ (Flipkart) లపై వచ్చిన భారీ అవినీతి ఆరోపణలను ఆయన వెలికితీశారు. ఈ సంస్థలు భారతీయ పోటీ చట్టాలను ఉల్లంఘిస్తూ, తమ బినామీలైన కొద్దిమంది 'ప్రిఫర్డ్ సెల్లర్స్' (అనుకూల వ్యాపారుల)కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ, సెర్చ్ ఆల్గరిథమ్లను మానిప్యులేట్ చేస్తూ, భారీ డిస్కౌంట్ల (క్యాష్ బర్నింగ్) ద్వారా దేశంలోని లక్షలాది చిన్న వ్యాపారుల పొట్టకొడుతున్న వైనాన్ని వేలాది పేజీల నివేదికతో సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు.

ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (IARI) లో పీహెచ్డీ చేస్తూ తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించిన డాక్టర్ శివప్రసాద్ నివేదిక ఆధారంగానే ప్రస్తుతం ఈడీ (ED) 'ఫెమా' చట్ట ఉల్లంఘనల కింద, అలాగే ఐటీ శాఖ పన్నుల ఎగవేత కింద ఈ అంతర్జాతీయ కంపెనీలపై విచారణ జరుపుతున్నాయి. ఒక సమర్థుడైన అధికారి నిబద్ధతతో పనిచేస్తే దేశ వాణిజ్య ముఖచిత్రాన్ని మార్చేసే కార్పొరేట్ శక్తులను సైతం చట్టం ముందు మోకరిల్లేలా చేయవచ్చని ఆయన నిరూపించారు. చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రానికి నిలువెత్తు రూపంగా నిలిచిన డాక్టర్ జి.వినాయక శివప్రసాద్ ఐపీఎస్ ప్రస్థానం నేటి యువతకు మరియు పోలీస్ వ్యవస్థకు ఒక గొప్ప స్ఫూర్తిదాయకం.

Tags

Be the first to react

Latest