Clay Pot Water: మట్టి కుండ కొనాలనుకుంటున్నారా... ఈ 4 విషయాలు తెలుసుకోండి!! Natural Tips: ఇంట్లో చీమల బెడద ఎక్కువగా ఉందా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి! Laundry Hacks: బట్టలపై టీ, కాఫీ మరకలా? చింత వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! Summer Mangoes: మామిడి ప్రియులారా, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. కల్తీ మామిడిని గుర్తించడం ఇక చాలా ఈజీ! Summer Tips: ఏసీ, కూలర్ లేకపోయినా ఇల్లు చల్లగా ఉండాలా? ఈ చిట్కాలు పాటించండి! Alcohol Ban: ఊరిలో మద్యం తాగితే కఠిన శిక్షలు..! 20 ఏళ్లుగా ఆదర్శంగా నిలుస్తున్న ఏపీ గ్రామం! Kitchen Tips: వంటింట్లో మనం చేసే 5 తప్పులు.. వైటమిన్లను ఆవిరి చేస్తున్న మన వంట పద్ధతులు.! Surnames: తెలుగు వారి ఇంటి పేర్లు ఎలా పుట్టాయి... అసలు రహస్యం? Tea Lovers: రెండు కంటే ఎక్కువ కప్పుల టీ తాగుతున్నారా! ఇది మీ కోసమే... Indian Festivals: దేశవ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాలు..! ఏ రాష్ట్రంలో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా? Clay Pot Water: మట్టి కుండ కొనాలనుకుంటున్నారా... ఈ 4 విషయాలు తెలుసుకోండి!! Natural Tips: ఇంట్లో చీమల బెడద ఎక్కువగా ఉందా? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి! Laundry Hacks: బట్టలపై టీ, కాఫీ మరకలా? చింత వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! Summer Mangoes: మామిడి ప్రియులారా, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. కల్తీ మామిడిని గుర్తించడం ఇక చాలా ఈజీ! Summer Tips: ఏసీ, కూలర్ లేకపోయినా ఇల్లు చల్లగా ఉండాలా? ఈ చిట్కాలు పాటించండి! Alcohol Ban: ఊరిలో మద్యం తాగితే కఠిన శిక్షలు..! 20 ఏళ్లుగా ఆదర్శంగా నిలుస్తున్న ఏపీ గ్రామం! Kitchen Tips: వంటింట్లో మనం చేసే 5 తప్పులు.. వైటమిన్లను ఆవిరి చేస్తున్న మన వంట పద్ధతులు.! Surnames: తెలుగు వారి ఇంటి పేర్లు ఎలా పుట్టాయి... అసలు రహస్యం? Tea Lovers: రెండు కంటే ఎక్కువ కప్పుల టీ తాగుతున్నారా! ఇది మీ కోసమే... Indian Festivals: దేశవ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాలు..! ఏ రాష్ట్రంలో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా?

Post Office Interest Rates 2026: ఏప్రిల్ నుంచి పోస్టాఫీస్ వడ్డీ రేట్లు మారుతున్నాయా? పీపీఎఫ్, సుకన్య సమృద్ధి పథకాల లేటెస్ట్ అప్‌డేట్!

Post Office Interest Rates 2026: ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి పీపీఎఫ్ (PPF), సుకన్య సమృద్ధి (SSY) వంటి పోస్టాఫీస్ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత వడ్డీ రేట్లు, రూ. 10,000 డిపాజిట్‌పై వచ్చే లాభాల పూర్తి వివరాలు

Published : 2026-03-30 14:41:00

Post Office Interest Rates 2026: కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాలు  ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా రిస్క్ లేకుండా లాభం పొందాలనుకునే వారు పోస్టాఫీస్ పథకాలపైనే ఎక్కువ మొగ్గు చూపుతారు. అయితే, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం మార్చి నెల ముగుస్తుండటంతో, ఏప్రిల్ - జూన్ త్రైమాసికానికి సంబంధించి కొత్త వడ్డీ రేట్లు ఎలా ఉండబోతున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గత రెండేళ్లుగా చూస్తే, కేంద్ర ప్రభుత్వం చాలా వరకు ఈ పథకాల వడ్డీ రేట్లను మార్చకుండా స్థిరంగానే కొనసాగిస్తోంది. చివరిసారిగా 2024 డిసెంబర్‌లో సుకన్య సమృద్ధి యోజన కొన్ని టైమ్ డిపాజిట్లపై మాత్రమే స్వల్పంగా రేట్లు పెంచారు. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం  నేపథ్యంలో ఈసారి కూడా వడ్డీ రేట్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. మార్చి 31న కేంద్రం దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం అమలులో ఉన్న వడ్డీ రేట్లను గమనిస్తే, పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాపై 4 శాతం వడ్డీ వస్తోంది. అలాగే, ఒక ఏడాది కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.9 శాతం, రెండేళ్ల కాలానికి 7 శాతం, మూడేళ్లకు 7.1 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి. ఐదేళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై అత్యధికంగా 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. ఒకవేళ మీరు రూ. 10,000 డిపాజిట్ చేస్తే, ఏడాదికి సుమారుగా రూ. 700 నుండి రూ. 770 వరకు వడ్డీ రూపంలోనే లాభం పొందే అవకాశం ఉంది.

మహిళలు పిల్లల కోసం ప్రవేశపెట్టిన పథకాలు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన (SSY) కింద ప్రస్తుతం 8.20 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఇందులో ఏటా రూ. 10,000 చొప్పున 15 ఏళ్ల పాటు పొదుపు చేస్తే, మెచ్యూరిటీ సమయానికి సుమారు రూ. 4.61 లక్షల భారీ మొత్తం చేతికి అందుతుంది. అదేవిధంగా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) లో ఏడాదికి రూ. 10,000 పొదుపు చేస్తే, 15 ఏళ్ల తర్వాత రూ. 2.71 లక్షలు పొందే వీలుంది. ఈ పథకాలు దీర్ఘకాలిక అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకంలో 8.20 శాతం వడ్డీ లభిస్తోంది. ఇందులో రూ. 10,000 పెట్టుబడి పెడితే ప్రతి మూడు నెలలకు రూ. 205 వడ్డీ వస్తుంది. ఇక నెలవారీ ఆదాయం కోరుకునే వారి కోసం 'మంత్లీ ఇన్‌కం స్కీమ్' ఉంది, దీని ద్వారా ప్రతి నెలా స్థిరమైన వడ్డీ పొందవచ్చు. ఈ వడ్డీ రేట్లన్నీ మార్చి 31 వరకు అమలులో ఉంటాయి. కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1) నుండి వడ్డీ రేట్లు పెరుగుతాయా లేక పాతవే కొనసాగుతాయా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

Spotlight

Read More →