LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Summer Power Saving Tips: ఏసీ వాడుతున్నారా? నెలకు వేల రూపాయల కరెంటు బిల్లు ఆదా చేసే సింపుల్ ట్రిక్స్!

Summer Power Saving Tips: వేసవిలో ఏసీ, కూలర్ల వినియోగం వల్ల వచ్చే భారీ కరెంటు బిల్లులతో ఇబ్బంది పడుతున్నారా? విద్యుత్ వినియోగాన్ని 30 శాతం వరకు తగ్గించి, మీ డబ్బును ఆదా చేసే ఉత్తమ చిట్కాలు..

AndhraPravasi News Desk 2 min read
Summer Power Saving Tips: ఏసీ వాడుతున్నారా? నెలకు వేల రూపాయల కరెంటు బిల్లు ఆదా చేసే సింపుల్ ట్రిక్స్!

Summer Power Saving Tips: వేసవి కాలం పూర్తిగా రాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు గిర్రున తిరగడం మొదలయ్యాయి. అయితే, చల్లదనం మాట దేవుడెరుగు కానీ నెల తిరిగేసరికి వచ్చే కరెంటు బిల్లును చూసి సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాడుక పెరిగే కొద్దీ బిల్లు కూడా తడిసి మోపెడవుతోంది. ఇలాంటి సమయంలో కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే, జేబుకు చిల్లు పడకుండా జాగ్రత్త పడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ముందుగా మన ఇంట్లోని పాతకాలపు బల్బులను మార్చడం వల్ల పెద్ద మార్పు వస్తుంది. చాలామంది ఇప్పటికీ పాత ట్యూబ్ లైట్లు లేదా పసుపు రంగు బల్బులను వాడుతుంటారు. వాటి స్థానంలో ఎల్ఈడీ బల్బులను అమర్చుకుంటే సుమారు 80 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. ఇవి తక్కువ కరెంటును వాడుకోవడమే కాకుండా, ఇంట్లో వేడిని కూడా తగ్గించి వెలుతురును ఎక్కువగా ఇస్తాయి. పగటిపూట కిటికీలు తెరిచి ఉంచితే సహజమైన గాలి, వెలుతురు వస్తాయి కాబట్టి, లైట్లు వేయాల్సిన అవసరం ఉండదు.

ఇక ఏసీ వాడే వారు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. ఏసీని ఎప్పుడూ 16 లేదా 18 డిగ్రీల వద్ద పెట్టకూడదు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ  ప్రకారం, ఏసీని 24 నుండి 26 డిగ్రీల మధ్య ఉంచడం వల్ల గది చల్లగా ఉండటమే కాకుండా కరెంటు బిల్లు భారీగా తగ్గుతుంది. అలాగే, ఏసీ ఫిల్టర్లను నెలకు ఒకసారి శుభ్రం చేయడం మర్చిపోవద్దు. ఫిల్టర్లలో దుమ్ము పేరుకుపోతే ఏసీ మీద ఒత్తిడి పెరిగి కరెంటు ఎక్కువగా లాగుతుంది. 

కిటికీలు, తలుపులు సరిగ్గా మూసి ఉంచడం వల్ల చల్లదనం బయటకు పోకుండా ఉంటుంది. మనం చేసే మరో పెద్ద తప్పు ఏమిటంటే.. ఫోన్ ఛార్జింగ్ అయిపోగానే ప్లగ్ తీయకుండా స్విచ్ ఆన్ లోనే ఉంచడం. టీవీ, కంప్యూటర్, ఓవెన్ వంటి పరికరాలను రిమోట్ తో ఆపేసినా, మెయిన్ స్విచ్ ఆన్ లో ఉంటే అవి కొంత విద్యుత్తును వాడుకుంటూనే ఉంటాయి. దీనినే 'ఫాంటమ్ పవర్' అంటారు. పని పూర్తయిన వెంటనే ప్లగ్ నుంచి వైరును తీసేయడం లేదా స్విచ్ ఆపేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చిన్న మొత్తంలోనే అయినా నెల మొత్తం మీద గణనీయమైన పొదుపు కనిపిస్తుంది.

 కొత్తగా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కొనేటప్పుడు దానిపై ఉన్న 'స్టార్ రేటింగ్'ను తప్పకుండా గమనించాలి. 5-స్టార్ రేటింగ్ ఉన్న పరికరాలు కొంచెం ధర ఎక్కువైనా, అవి వాడే కరెంటు చాలా తక్కువగా ఉంటుంది. ఫ్రిజ్ ను గోడకు మరీ ఆనించి పెట్టకుండా కొంచెం గ్యాప్ ఇవ్వడం వల్ల అది వేడిని త్వరగా బయటకు పంపి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ చిన్న చిన్న మార్పులు మన దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే, ఎండకాలంలో కూడా కరెంటు బిల్లు భయం లేకుండా హాయిగా ఉండొచ్చు.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…