మొబైల్ మార్కెట్‌లో రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలవుతున్న తరుణంలో, చైనాకు చెందిన ప్రముఖ బ్రాండ్ ఇన్ఫినిక్స్ మరో గేమింగ్-ఫోకస్డ్ ఫోన్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. Infinix GT 30 Pro 5G పేరుతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లోకి రానుంది. ఇది ఇప్పటికే ఉన్న Infinix GT 20 Proకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా విడుదల కానుంది. ఈ ఫోన్‌ను ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో ఇప్పటికే లాంచ్ చేయగా, భారత్‌లో లాంచ్‌పై త్వరలోనే స్పష్టత రానుంది.
Infinix GT 30 Pro 5Gలో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2160Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2304Hz PWM డిమ్మింగ్‌తో గేమింగ్‌కు అనుకూలంగా డిజైన్ చేశారు. 1100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు గోరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, బ్లూ లైట్ మరియు ఫ్లికర్-ఫ్రీ సర్టిఫికేషన్లు ఈ డిస్‌ప్లే ప్రత్యేకత.
ఈ ఫోన్‌లో 4nm టెక్నాలజీతో తయారైన MediaTek Dimensity 8350 Ultimate ప్రాసెసర్ ఉంటుంది. దీనితో పాటు 12GB LPDDR5X ర్యామ్, 256GB / 512GB UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్లు ఉంటాయి. వర్చువల్ ర్యామ్‌ను మరో 12GB వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ Android 15 ఆధారిత XOS 15పై నడుస్తుంది. గేమింగ్ అనుభవాన్ని మెరుగుపర్చేందుకు XBoost గేమింగ్ ఇంజిన్, AI ఆధారిత VC కూలింగ్ సిస్టమ్, షోల్డర్ ట్రిగ్గర్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
కెమెరా సెక్షన్‌లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో 5,500mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అదనంగా 10W వైర్డ్, 5W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది.
Infinix GT 30 Pro 5G బేస్ వేరియంట్ (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) ధర సుమారు రూ.26,000గా ఉండొచ్చని అంచనా. అలాగే 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.30,000గా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ బ్లేడ్ వైట్, డార్క్ ఫ్లేర్, షాడో యాష్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. గేమింగ్ మాస్టర్ ఎడిషన్‌లో మాగ్‌చార్జ్ కూలర్, మాగ్ కేస్ వంటి యాక్సెసరీస్ కూడా ఉంటాయని సమాచారం.