Praja Vedika: రేపు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Cabinet: రుషికొండ భవనాలపై వీడిన సస్పెన్స్.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధం! Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్! Praja Vedika: రేపు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Cabinet: రుషికొండ భవనాలపై వీడిన సస్పెన్స్.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధం! Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్!

AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!!

రాష్ట్రాభివృద్ధి లక్ష్యాలను నిబద్ధతతో ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి

Published : 2025-12-18 09:22:00
AP governance: ఏపీ పాలనకు కొత్త ఊపిరి.. పవన్, లోకేశ్ పనితీరుపై ప్రశంసలు!

రాష్ట్రాభివృద్ధి లక్ష్యాలను నిబద్ధతతో ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు బాధ్యతాయుతంగా, ప్రజల అవసరాలను అర్థం చేసుకుంటూ పనిచేస్తే కూటమి ప్రభుత్వ సంకల్పాలు మరింత వేగంగా అమలవుతాయని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన 5వ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మూడు దేశాల పర్యటన... చివరగా ఒమన్ చేరుకున్న మోదీ! ఆ రంగాల్లో కీలక ఒప్పందాలే లక్ష్యం!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో జిల్లా కలెక్టర్ల పాత్ర అత్యంత కీలకమని  ఇప్పటివరకు ప్రభుత్వ లక్ష్యాల సాధనలో కలెక్టర్లు చూపిన చొరవ అభినందనీయమని, భవిష్యత్తులో కూడా అదే ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నట్లు వివరించారు. అడవి తల్లి బాట పేరుతో చేపట్టిన రహదారి ప్రాజెక్టు ద్వారా మారుమూల గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపడుతుందని, ఈ కార్యక్రమాన్ని సంబంధిత జిల్లాల కలెక్టర్లు సమర్థంగా అమలు చేస్తున్నారని తెలిపారు.

India vs South Africa: నాలుగో టీ20కి పొగమంచు పంజా.. టీమిండియాలో కీలక మార్పులు!

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పల్లె పండుగ 1.0’ కార్యక్రమం నిర్దేశిత గడువులోగా పూర్తి కావడం ప్రభుత్వ సమన్వయానికి నిదర్శనమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నరేగా నిధులతో గ్రామాల్లో సుమారు నాలుగు వేల కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు పూర్తి చేసినట్లు చెప్పారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని వివరించారు. రైతులకు అండగా నిలిచేలా 22,500 మినీ గోకులాలు, 15 వేల నీటి తొట్టెలు, 1.2 లక్షల ఫామ్ పాండ్లు నిర్మించామని తెలిపారు. ఇవన్నీ సకాలంలో పూర్తి కావడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతం లభించిందన్నారు.

టీడీపీ సీనియర్ నేత ఇంట్లో తీవ్ర విషాదం.. కృష్ణా జిల్లా పెద్ద అవుటుపల్లిలో..

ఉపాధి కల్పన విషయంలోనూ ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించామని, మొత్తం 15.95 కోట్ల పని దినాల ద్వారా రూ.4,330 కోట్ల వేతనాలు చెల్లించామని వెల్లడించారు. అలాగే మెటీరియల్ కాంపోనెంట్ కింద మరో రూ.1,056.85 కోట్లను బిల్లుల రూపంలో చెల్లించడం జరిగిందని తెలిపారు. ఈ చర్యలన్నీ గ్రామీణ ప్రజలకు ఆర్థిక భరోసాగా నిలిచాయని చెప్పారు.

Old coaches: పాత బోగీలకు గుడ్‌బై… ఆధునిక ఎల్హెచ్‌బి బోగీలకు గ్రీన్ సిగ్నల్!

గ్రామ పంచాయతీల స్వయం ఆదాయ వనరుల పెంపుపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ సూచించారు. పన్నులు, నాన్ టాక్స్ ఆదాయాలను డిజిటలైజ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ శిక్షణ కార్యక్రమాల్లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమని చెప్పారు. ఈ శిక్షణల వల్ల ఉద్యోగుల సామర్థ్యం పెరిగిందని, గ్రామస్థాయిలో పాలనా నైపుణ్యాలు మెరుగుపడేందుకు ఇవి దోహదపడుతున్నాయని వివరించారు.

AP Farmers: రైతులకు తీపికబురు... మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్! చెక్ చేసుకోండి!

జూన్ నెలలో ప్రారంభించిన ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఒక యూనిట్‌తో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం 25 యూనిట్లకు విస్తరించిందని చెప్పారు. అలాగే పీఎం జన్మన్ పథకం, నరేగా సహకారంతో గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించే కార్యక్రమంలో కొన్ని జిల్లాలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని పేర్కొన్నారు. అటవీ అనుమతుల విషయంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ అన్ని అనుమతులు పూర్తి చేయగా, అల్లూరి జిల్లా కలెక్టర్ కూడా అధిక శాతం అనుమతులు సాధించారని వివరించారు. ఇవన్నీ కలెక్టర్ల నిబద్ధతకు నిదర్శనమని, ఇదే ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Praja Vedika: నేడు (18/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Housing Scheme: ఏపీలో పేదల ఇళ్ల కల నెరవేర్చే దిశగా కీలక అడుగు! ఒక్కొక్కరికి రూ.1.59 లక్షలు... పూర్తి వివరాలు!
AP Rationcards: రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్! జస్ట్ స్కాన్ చేస్తే చాలు..

Spotlight

Read More →