Annadata: రైతుల విజ్ఞాన వేదిక ‘అన్నదాత’కు 30 ఏళ్లు.. మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు!
Annadata: రైతులకు వ్యవసాయ సమాచారం అందిస్తూ మూడు దశాబ్దాలుగా విశేష సేవలు అందిస్తున్న ఈటీవీ ‘అన్నదాత’ కార్యక్రమం 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కార్యక్రమ యాజమాన్యానికి, సంపాదక బృందానికి, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
మూడు దశాబ్దాలుగా రైతు సేవలో ‘అన్నదాత’.. అభినందించిన మంత్రి..
ఆధునిక వ్యవసాయాన్ని రైతులకు చేరువ చేసిన ‘అన్నదాత’ కార్యక్రమం..
శ్రీకాకుళం: రైతులకు వ్యవసాయ సమాచారం అందిస్తూ మూడు దశాబ్దాలుగా విశేష సేవలు అందిస్తున్న ఈటీవీ ‘అన్నదాత’ కార్యక్రమం 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కార్యక్రమ యాజమాన్యానికి, సంపాదక బృందానికి, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
1996 జూన్ 30న దివంగత రామోజీరావు దూరదృష్టితో ప్రారంభించిన ‘అన్నదాత’ కార్యక్రమం అప్పటి నుంచి రైతులకు నమ్మకమైన సమాచార వేదికగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక సాగు పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలను రైతులకు సులభంగా అర్థమయ్యేలా అందించడంలో ‘అన్నదాత’ కీలక పాత్ర పోషించిందని అచ్చెన్నాయుడు కొనియాడారు.
ఎండా వానలను లెక్కచేయకుండా కష్టపడే రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్న కార్యక్రమంగా ‘అన్నదాత’ గుర్తింపు పొందిందన్నారు.
రైతు సంక్షేమం, వ్యవసాయ పురోగతి లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతున్న తీరు అభినందనీయమని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంత రైతులకు కొత్త పద్ధతులు, పంటల నిర్వహణ, వ్యవసాయ పరిజ్ఞానాన్ని చేరువ చేయడంలో ఈ కార్యక్రమం చేసిన సేవలు ఎంతో విలువైనవని అన్నారు.
రైతుల కోసం ప్రారంభమైన ‘అన్నదాత’ కార్యక్రమం మరెన్నో సంవత్సరాలు విజయవంతంగా కొనసాగాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. రైతు సేవలో ఈ కార్యక్రమం మరింత ముందుకు సాగాలని కోరారు.