⚡ BREAKING

Machilipatnam: మచిలీపట్నం అభివృద్ధికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ సహకారం!

Machilipatnam: మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారం, యువత మరియు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాల కల్పన కోసం పలు కార్యక్రమాలను చేపట్టేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందించింది.

Machilipatnam
Machilipatnam

తీర ప్రాంత తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక: ఆర్ట్ ఆఫ్ లివింగ్..

యువత, మహిళల స్వయం ఉపాధికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు..

మచిలీపట్నం: మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారం, యువత మరియు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాల కల్పన కోసం పలు కార్యక్రమాలను చేపట్టేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందించింది.

ఈ మేరకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ (బెంగళూరు) ప్రతినిధులు జయచంద్ర, యాదవ్ మచిలీపట్నంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు తమ ప్రతిపాదనలను వివరించారు.

మచిలీపట్నం నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు ప్రతినిధులు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో వివిధ చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.

అలాగే గ్రామీణ ప్రాంత యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. నైపుణ్య శిక్షణ ద్వారా యువత స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.

తీర ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, సివిల్ సర్వీసెస్కు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

పైలెట్ ప్రాజెక్టుగా మచిలీపట్నం మండలంలోని పెదపట్నం, పల్లెతుమ్మలపాలెం గ్రామాల్లో తాగునీటి ప్రాజెక్టును ప్రారంభించేందుకు తమ ప్రణాళికలను వివరించారు.

ప్రజల సంక్షేమం కోసం స్వచ్ఛంద సంస్థలు చేపట్టే ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. ప్రజలకు నేరుగా ప్రయోజనం కలిగించే కార్యక్రమాలను వేగంగా అమలు చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేస్తారని తెలిపారు.

తాగునీరు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో ఈ కార్యక్రమాలు మచిలీపట్నం ప్రాంత ప్రజలకు ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు.

Be the first to react

Latest