UAE: యూఏఈలో భారత రాయబార కార్యాలయాల అత్యవసర సేవలు కొనసాగింపు.. జూలై 1 వరకు పొడిగింపు!

UAE: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో భారతీయులకు అందించే కాన్సులర్ సేవల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. పరిపాలనా కారణాలతో భారత రాయబార కార్యాలయం, దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు అత్యవసర సేవలను మాత్రమే జూలై 1 వరకు కొనసాగించనున్నాయి.

UAE
UAE

పాస్పోర్ట్, వీసా సేవలకు తాత్కాలిక పరిమితులు.. కొత్త విధానానికి మార్పులు..

యూఏఈలో భారతీయులకు అలర్ట్.. ఎమర్జెన్సీ కాన్సులర్ సేవలు కొనసాగింపు..

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో భారతీయులకు అందించే కాన్సులర్ సేవల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. పరిపాలనా కారణాలతో భారత రాయబార కార్యాలయం, దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు అత్యవసర సేవలను మాత్రమే జూలై 1 వరకు కొనసాగించనున్నాయి.

అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, పాస్పోర్ట్, వీసా, ఇతర కాన్సులర్ సేవలు, అటెస్టేషన్ వంటి సేవలు ప్రస్తుతం అత్యవసర అవసరాలకే పరిమితం చేయబడ్డాయి. సాధారణ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.

యూఏఈలో పాస్పోర్ట్, వీసా, అటెస్టేషన్ సేవలను కొత్త అవుట్సోర్సింగ్ సంస్థకు అప్పగించే ప్రక్రియలో భాగంగా ఈ మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త వ్యవస్థలో అల్ హింద్ టూర్స్ అండ్ ట్రావెల్ LLC ఈ సేవల నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది.

ఇప్పటి వరకు పాస్పోర్ట్, వీసా దరఖాస్తులను నిర్వహించిన BLS ఇంటర్నేషనల్, అటెస్టేషన్ సేవలను నిర్వహించిన SGIVS గ్లోబల్ సంస్థలు జూన్ 25 తర్వాత కొత్త దరఖాస్తుల స్వీకరణను నిలిపివేశాయి.

మొదట జూన్ 26 నుంచి 30 వరకు సాధారణ కాన్సులర్ సేవలు అందుబాటులో ఉండవని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. తాజాగా ఈ అత్యవసర సేవల వ్యవధిని మరో రోజు పొడిగించి జూలై 1 వరకు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.

అత్యవసర అవసరాలు ఉన్న భారతీయులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ హెల్ప్లైన్, వాట్సాప్ నంబర్, ఈమెయిల్ ద్వారా సహాయం పొందవచ్చని అధికారులు సూచించారు. జూలై 2 నుంచి కాన్సులర్ సేవలపై పూర్తి వివరాలను ప్రత్యేకంగా ప్రకటిస్తామని రాయబార కార్యాలయం తెలిపింది. 

యూఏఈలో నివసిస్తున్న భారతీయులు పాస్పోర్ట్, వీసా, అటెస్టేషన్ తదితర సేవలకు సంబంధించి కేవలం అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం, దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని సూచించారు.

Tags

Be the first to react

Latest