⚡ BREAKING
Gulf

UAE: యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవలకు తాత్కాలిక విరామం.. జూలై 1 నుంచి కొత్త విధానం!

UAE: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో నివసిస్తున్న భారతీయులకు కీలక సమాచారం. భారత పాస్‌పోర్ట్, వీసా, అటెస్టేషన్ సేవల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొత్త అవుట్‌సోర్సింగ్ సేవల సంస్థ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ నెల చివర్లో ఐదు రోజుల పాటు సాధారణ కాన్సులర్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.

UAE
UAE

కొత్త అవుట్‌సోర్సింగ్ సంస్థకు బాధ్యతలు అప్పగింత.. ఐదు రోజుల పాటు సాధారణ సేవలు నిలిపివేత..

ఐదు రోజుల పాటు నిలిచిపోనున్న సాధారణ పాస్‌పోర్ట్, వీసా సేవలు..

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో నివసిస్తున్న భారతీయులకు కీలక సమాచారం. భారత పాస్‌పోర్ట్, వీసా, అటెస్టేషన్ సేవల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొత్త అవుట్‌సోర్సింగ్ సేవల సంస్థ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ నెల చివర్లో ఐదు రోజుల పాటు సాధారణ కాన్సులర్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.

అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించిన వివరాల ప్రకారం, జూలై 1, 2026 నుంచి యూఏఈ వ్యాప్తంగా భారత కాన్సులర్ సేవలను అల్ హింద్ టూర్స్ అండ్ ట్రావెల్ ఎల్‌ఎల్‌సీ నిర్వహించనుంది.

ప్రస్తుతం పాస్‌పోర్ట్, వీసా సేవలను అందిస్తున్న బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ (BLS International), అటెస్టేషన్ సేవలను నిర్వహిస్తున్న ఎస్‌జీఐవీఎస్ గ్లోబల్ (SGIVS Global) సంస్థలు జూన్ 25 తర్వాత కొత్త దరఖాస్తులను స్వీకరించవు.

సేవల మార్పిడి ప్రక్రియలో భాగంగా జూన్ 26 నుంచి జూన్ 30 వరకు పాస్‌పోర్ట్, వీసా, అటెస్టేషన్‌కు సంబంధించిన సాధారణ అపాయింట్‌మెంట్లు అందుబాటులో ఉండవు.

అయితే అత్యవసర పరిస్థితుల్లో భారత రాయబార కార్యాలయం, దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు అత్యవసర పాస్‌పోర్ట్, వీసా, అటెస్టేషన్ సేవలను కొనసాగిస్తాయని అధికారులు తెలిపారు.

అత్యవసర సహాయం అవసరమైన వారు:
టోల్ ఫ్రీ నంబర్ 800 46342 (800 INDIA)
వాట్సాప్ నంబర్ +971 54 309 0571
ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.
కొత్త ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ విధానం

జూలై 1 నుంచి అల్ హింద్ టూర్స్ అండ్ ట్రావెల్ కొత్త ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఇకపై పాస్‌పోర్ట్, వీసా, అటెస్టేషన్ సేవలకు సంబంధించిన దరఖాస్తులు ఈ కొత్త విధానం ద్వారా నిర్వహించబడతాయి.

యూఏఈలోని భారతీయులు అధికారిక సమాచార మార్గాలను మాత్రమే అనుసరించాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం, దుబాయ్‌లోని భారత కాన్సులేట్ అధికారిక వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా ఖాతాల ద్వారా మాత్రమే తాజా వివరాలు తెలుసుకోవాలని పేర్కొంది.

భారతీయులకు సేవలు మరింత సులభంగా అందించేందుకు యూఏఈలో మొత్తం 16 కొత్త కాన్సులర్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

వివరాల ప్రకారం:
అబుదాబిలో ఆరు కేంద్రాలు
అల్ ఖలీదియా
అల్ రీమ్ ఐలాండ్
ముసఫా
మదీనత్ జాయెద్
ఘయాతి
అల్ ఐన్

దుబాయ్‌లో రెండు కేంద్రాలు
బర్ దుబాయ్
దుబాయ్ ఇన్వెస్ట్‌మెంట్ పార్క్ (DIP)
షార్జాలో రెండు కేంద్రాలు
అల్ మజాజ్
రోల్లా

ఇతర కేంద్రాలు:
అజ్మాన్ (అల్ జుర్ఫ్)
ఫుజైరా
ఉమ్ అల్ కువైన్
ఖోర్ ఫక్కాన్ (కార్నిష్)
కల్బా
రాస్ అల్ ఖైమా

ఈ కొత్త వ్యవస్థతో యూఏఈలో ఉన్న లక్షలాది మంది భారతీయులకు పాస్‌పోర్ట్, వీసా, అటెస్టేషన్ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.

Be the first to react

More Coverage