USA Vs Iran: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై అనిశ్చితి.. మరింత సమయం అవసరమన్న ఇరాన్!

USA Vs Iran: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై ఆసక్తి నెలకొన్న వేళ, ఈ ఒప్పందం విషయంలో స్పష్టత రావాల్సి ఉందని ఇరాన్ వెల్లడించింది.

USA Vs Iran
USA Vs Iran

జూన్ 14న ఒప్పందం ఉంటుందన్న పాక్ ప్రధాని.. వెంటనే స్పందించిన ఇరాన్..

అమెరికా-ఇరాన్ చర్చలు కొనసాగుతున్నాయి.. సంతకాల తేదీపై ఇంకా స్పష్టత లేదు..

టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై ఆసక్తి నెలకొన్న వేళ, ఈ ఒప్పందం విషయంలో స్పష్టత రావాల్సి ఉందని ఇరాన్ వెల్లడించింది.

ఈ నెల 14వ తేదీ ఆదివారం అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరగవచ్చని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఒప్పందానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ సంతకాలు, సాంకేతిక స్థాయి చర్చలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

అయితే పాక్ ప్రధాని ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఇరాన్ స్పందించింది. ఆదివారం రోజున ఒప్పందంపై సంతకాలు జరగవని, ఇందుకు మరికొంత సమయం అవసరమని ఇరాన్ స్పష్టం చేసింది.

ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, ఇస్లామాబాద్ మెమోరాండంపై భవిష్యత్లో సంతకాలు చేసే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని తెలిపారు. అయితే అమెరికా నుంచి ఉన్న అనుమానాలు, చర్చల్లోని అంశాలను దృష్టిలో ఉంచుకుని సంతకాల తేదీపై జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

శాంతి ఒప్పందం దిశగా చర్చలు కొనసాగుతున్నప్పటికీ, తుది నిర్ణయానికి మరింత చర్చలు అవసరమని ఇరాన్ వైఖరితో స్పష్టమవుతోంది. అమెరికా-ఇరాన్ సంబంధాల్లో ఈ పరిణామాలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Be the first to react

Latest