శరీరం సూర్యకాంతి తక్కువగా అందుకోవడంతో ముఖ్యమైన పోషకాలు లోపిస్తాయి. ఈ సమయంలో ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఆహారమే ప్రధాన ఆధారం. అందుకే న్యూట్రిషన్ నిపుణులు శీతాకాలంలో పోషకవిలువలతో కూడిన శాకాహారం, ప్రోటీన్, సహజ ఫ్యాట్స్, కూరగాయలు, మష్రూమ్స్, చేపలు వంటి పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో చలికాలంలో శరీరానికి శక్తి, రోగనిరోధక శక్తి, మనసుకు ఉత్సాహం ఇచ్చే ఐదు సులభమైన వంటకాలు ఇప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందుతున్నాయి. వీటికి ప్రత్యేకమైన పదార్థాలు అవసరం కాదు. ఇంట్లోనే నిత్యం లభించే పదార్థాలతో తయారయ్యే ఈ వంటకాలు ఆరోగ్యానికి సహాయకరాలు.
మష్రూమ్ మసాలా టోస్ట్ ఉదయం అలసటగా ఉంటే ఈ టోస్ట్ నిజంగా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఉల్లిపాయలు, మష్రూమ్, మిరపకాయతో చేసిన మిశ్రమాన్ని బ్రెడ్ మీద వేసి వేడిగా తింటే గంటలపాటు శరీరానికి శక్తి అందుతుంది. మష్రూమ్స్ సహజంగా పుష్కలమైన పోషకాలు కలిగి ఉండటంతో ఇది ఉదయం శరీరానికి తేలికగా, అయితే పోషకంగా ఉంటుంది.
ఎన్‌రిచ్డ్ కర్డ్ రైస్ మధ్యాహ్నం కడుపుకు ఉపశమనం
కర్డ్ రైస్ అంటే చాలా మందికి ఇష్టమే. కానీ దీనిలో తురిమిన క్యారట్, కీర వంటి పదార్థాలు కలిపితే ఇది మరింత పోషకంగా మారుతుంది. పైగా ఆవాలు, కరివేపాకు తాలింపు వేశాక సువాసనతో పాటు శరీరానికి కావలసిన శాంతి కూడా లభిస్తుంది. కర్డ్‌లో ఉండే ప్రోబయాటిక్స్ జీర్ణవ్యవస్థను బలపరుస్తాయి.
స్పినచ్ ఆమ్లెట్ రోల్ రాత్రికి తేలికగానూ, ఆరోగ్యంగానూ గుడ్డు, పాలకూర, టమాటాతో చేసిన ఆమ్లెట్‌ను రోటీలో ర్యాప్ చేసుకుని తింటే ఇది పూర్తి భోజనం అవుతుంది. రాత్రి తేలికగా తినాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. శాకాహారులు గుడ్డు స్థానంలో మష్రూమ్‌లను ఉపయోగించి ఇదే రుచిని పొందవచ్చు.
మస్టర్డ్ సాస్‌తో గ్రిల్ చేప పుష్కలమైన పోషకాలు
సాల్మన్, మాక్రెల్ వంటి చేపలు చలికాలంలో శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. మస్టర్డ్ పేస్ట్, వెల్లుల్లి, నిమ్మరసం మారినేషన్‌తో గ్రిల్ చేస్తే ఇది ఎంతో రుచికరంగా మారుతుంది. శరీరానికి శక్తినివ్వడం, రోగనిరోధక శక్తిని పెంచడం ఇందులో ఉన్న సహజ కొవ్వుల వల్ల సాధ్యమవుతుంది.
పనీర్–మష్రూమ్ స్కిలెట్ శాకాహారులకు పూర్తి పోషకాల భోజనం పనీర్, మష్రూమ్, పాలకూర, క్యాప్సికం అన్నింటిని కలిపి వేపితే సువాసనతో కూడిన మంచి భోజనం సిద్ధమవుతుంది. దీనిని రాత్రి భోజనంగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన ప్రోటీన్, కాల్షియం, ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి.
నిపుణులు చలికాలంలో శరీరం ఎక్కువ పోషకాలు కోరుకుంటుందని, అందుకే రోజువారీ ఆహారంలో వైవిధ్యాన్ని తీసుకురావాలని సూచిస్తున్నారు. ఒమెగా ఫ్యాట్స్, ప్రోటీన్, సహజ కార్బోహైడ్రేట్స్ ఉన్న పదార్థాలు తినడం ద్వారా శరీరం వేడిగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఐదు వంటకాలు ఆహారం పెట్టుకునే సమయాన్ని సులభతరం చేయడంతో పాటు శరీరానికి తగిన శక్తినిస్తాయి. ఈ సమాచారం కేవలం ఈ అవగాహనకు మాత్రమే ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించి తగిన సూచనలు తీసుకోవడం మంచిది.