Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక చర్చలు వేడెక్కించనున్న పార్లమెంట్! New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల.... Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ. పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్.. US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!! Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు! Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక చర్చలు వేడెక్కించనున్న పార్లమెంట్! New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల.... Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ. పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్.. US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!! Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు!

సత్యసాయి ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య, తాగునీటి సేవలను గుర్తుచేసిన ముఖ్యమంత్రి! ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ఆధ్వర్యంలో..

2025-11-23 16:08:00
Amaravati Banking: అమరావతి బ్యాంకింగ్ హబ్ నిర్మాణానికి స్టార్ట్.. కేంద్రమంత్రి రాబోతున్నారు!

శ్రీ సత్యసాయి బాబా మానవ రూపంలో అవతరించిన దైవమని, ఆయన తన సామాజిక సేవ, ఆధ్యాత్మిక భావనలు, అహింసా మార్గంతో కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. 

Cyclone: రేపే వాయుగుండం… మరో 48 గంటల్లో తుఫాన్ రూపంలో దూకుడుకి సిద్ధమవుతున్న బంగాళాఖాతం!

"అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయి.. ఎల్లప్పుడూ సాయపడు, ఎవరినీ నొప్పించకు" అనే బాబా బోధనలు విశ్వవ్యాప్తమని ఆయన అన్నారు. ఆదివారం పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, "ఒక గొప్ప సంకల్పంతో 1926 నవంబర్ 23న సత్యసాయి బాబా ఈ పుణ్యభూమిలో అవతరించారు. తన 86 ఏళ్ల జీవితాన్ని ఇక్కడే గడిపి, భగవాన్ సాయి తత్వాన్ని ప్రపంచానికి అందించారు. జ్ఞానాన్ని పంచి, సరైన మార్గాన్ని చూపించారు" అని స్మరించుకున్నారు. 

Traffic Challan Discount: ట్రాఫిక్ చలాన్లపై బంపర్ డిస్కౌంట్.. వాహనదారులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త!

కేవలం 8 ఏళ్ల వయసు నుంచే ప్రార్థనలు, కీర్తనలు, భజనలతో దైవిక ఆలోచనలున్న వ్యక్తిగా బాబా ఉండేవారని తెలిపారు. 14 ఏళ్ల వయసులో, 1940 మే 23న, తన అసలు పేరు సత్యనారాయణ రాజును త్యజించి, తనను తాను 'సత్యసాయి'గా ప్రకటించుకున్నారని వివరించారు. 

83 days: పండితుల హెచ్చరిక.. శుక్ర మౌఢ్యమిలో కీలక కార్యక్రమాలు నివారించండి.. 83 రోజులు శుభాలపై బ్రేక్!

దేవుళ్లు ఎక్కడో ఒకచోట అవతరిస్తారని, కానీ సత్యసాయి ఈ పవిత్ర భూమిని ఎంచుకున్నారని అన్నారు. చిత్రావతి నది ఒడ్డున ఉన్న పుట్టపర్తిని ఆధ్యాత్మిక, దైవిక కేంద్రంగా మార్చారని చంద్రబాబు ప్రశంసించారు.

సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే పంచ సూత్రాలతో సత్యసాయి బాబా ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 1960లో సత్యసాయి సంస్థల స్థాపనతో ఆయన సేవలు విస్తృత రూపాన్ని సంతరించుకున్నాయని గుర్తుచేశారు. 

Defence Careers: ఆర్మీ ఏవియేషన్ కెరీర్‌కి 2025 అవకాశం.. దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు!!

విశ్వశాంతి, విశ్వమానవ సౌభాగ్యం, సకల జనుల సంక్షేమాన్ని బాబా ఆకాంక్షించారని, అందుకే దేశవిదేశాల నుంచి ఎందరో సంపన్నులు, ప్రముఖులు స్వచ్ఛందంగా పుట్టపర్తికి వచ్చి ఆయన సేవా మార్గాన్ని అనుసరించారని తెలిపారు. ఎక్కడా దొరకని ప్రశాంతతను వారు ఇక్కడ పొందారని చెప్పారు.

సత్యసాయి బాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన స్ఫూర్తి ఈ ప్రదేశమంతా నిండి ఉందని చంద్రబాబు అన్నారు. ప్రశాంతి నిలయాన్ని ఒక 'ఎనర్జీ సెంటర్' (శక్తి కేంద్రం)గా అభివర్ణించారు. సరిగ్గా 75 ఏళ్ల క్రితం ఇదే రోజున నిర్మించిన ప్రశాంతి నిలయం, ఆధ్యాత్మిక వేడుకలకు వేదికగా, భక్తుల కష్టనష్టాలకు పరిష్కార వేదికగా నిలిచిందని కొనియాడారు. 

IIT Madras: ఐఐటీ మద్రాస్ నుంచి ఉచిత మెషిన్ లెర్నింగ్ కోర్స్… 2026 రిజిస్ట్రేషన్ ఓపెన్!!

'మానవ సేవే మాధవ సేవ' అని విశ్వసించిన బాబా, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా తన సేవలను మరింత విస్తరించారని తెలిపారు. వైద్యం, విద్య, తాగునీరు, మానసిక సంతృప్తి వరకు ప్రతీదాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చారని అన్నారు.

సత్యసాయి ట్రస్ట్ సేవలను వివరిస్తూ... 102 సత్యసాయి పాఠశాలల్లో 60,000 మంది విద్యార్థులు ఉచిత విద్యను పొందుతున్నారని, ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల ద్వారా ప్రతిరోజూ 3,000 మందికి వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోని 1,600 గ్రామాల్లో రూ. 550 కోట్ల వ్యయంతో 30 లక్షల మందికి పైగా ప్రజల దాహార్తిని తీర్చారని, చెన్నై తాగునీటి ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ. 250 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. 

నేడు సత్యసాయి ట్రస్ట్ 140 దేశాల్లో 2,000 కేంద్రాలతో విస్తరించిందని, సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా 10 జోన్లలో సాయి తత్వాన్ని, సేవలను ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. సత్యసాయి సంస్థల్లో 7.50 లక్షల మంది సేవా సభ్యులు ఉండటం గర్వకారణమని అన్నారు. సత్యసాయి సేవలను ప్రపంచానికి చాటిచెప్పేందుకే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహిస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. 

Chaitu new movie: చైతూ న్యూ మూవీ టైటిల్ లాంచ్.. మహేశ్ బాబు చేతుల మీదుగా వృషకర్మ రిలీజ్!

తెలంగాణలో కూడా అధికారికంగా శత జయంతి వేడుకలను నిర్వహిస్తున్నందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన అభినందించారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొని సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు.

AP State Corporations: 11 కార్పొరేషన్ లకు చైర్మన్ ల నియామకం!
Immigration Policy: ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో ...ఉక్రెయిన్ శరణార్థులు పరిస్థితి ఏమిటి?
Smriti Mandhana: టీమ్ ఇండియా స్టార్ స్మృతి మంధాన పెళ్లి.. సోషల్ మీడియాలో వీడియోలు హల్‌చల్
G20 Summit: జీ–20లో మోదీ దౌత్య పరాక్రమం.. యూఎన్ చీఫ్‌, బ్రిటన్ ప్రధానితో వరుస కీలక భేటీలు!!
తిరుమలలో పెరిగిన రద్దీ... ఉచిత దర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లు ఫుల్!
74వ రోజు ప్రజాదర్బార్... ప్రతి ఒక్కరి వినతులు స్వయంగా స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్!

Spotlight

Read More →