Mushroom Curry: రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ..వంట రాని వారు కూడా అద్భుతంగా చేయొచ్చు..ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ లొట్టలేసుకుంటూ తింటారు..!! Paneer Dum Biryani: నోరూరించే పనీర్ దమ్ బిర్యానీ.. రెస్టారెంట్ స్టైల్ రుచి ఇప్పుడు మీ ఇంట్లోనే! Pea recipe: పక్కింటి పంజాబీ ఆంటీ స్పెషల్ బఠాణీ కూర... ఈ రుచికి ఫ్యాన్స్ అవ్వాల్సిందే! Boiled egg vs omelet: ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్.. ఆరోగ్యానికి ఏది బెస్ట్! Gongura Pachadi: గోంగూర పచ్చడి ఇలా చేశారంటే ముద్ద అన్నం కూడా వదిలిపెట్టరు... అందులోకైతే అదిరిపోయే కాంబినేషన్ ..!! Cooking Tips: చపాతీలు గట్టిగా వస్తున్నాయా? ఈ చిన్న చిట్కాతో దూది లాంటి మెత్తటి 'lలేయర్ చపాతీలు మీ సొంతం! Vankaya Royyala Curry: వంకాయ ఎండు రొయ్యల కూర.. ఈ చిట్కాతో వండితే బిర్యానీ కూడా దిగదుడుపే! Gongura Chicken: నోరూరించే గోంగూర చికెన్.. ఈ కొలతలతో చేస్తే ముక్కకి పులుపు పట్టి గ్రేవీ అదిరిపోతుంది! ఇలా ఒకసారి ట్రై చేయండి..!! Plum Cake: నోరూరించే ప్లం కేక్.. ఇంట్లోనే బేకరీ స్టైల్ రుచితో.. ఇలా ఒక్కసారి ట్రై చేయండి..!! Andhra Style Nalla Karam: అమ్మమ్మల కాలం నాటి నల్ల కారం ఒకసారి ఇలా ట్రై చేయండి.. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుంటే ఓహో అనాల్సిందే..!! Mushroom Curry: రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ..వంట రాని వారు కూడా అద్భుతంగా చేయొచ్చు..ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ లొట్టలేసుకుంటూ తింటారు..!! Paneer Dum Biryani: నోరూరించే పనీర్ దమ్ బిర్యానీ.. రెస్టారెంట్ స్టైల్ రుచి ఇప్పుడు మీ ఇంట్లోనే! Pea recipe: పక్కింటి పంజాబీ ఆంటీ స్పెషల్ బఠాణీ కూర... ఈ రుచికి ఫ్యాన్స్ అవ్వాల్సిందే! Boiled egg vs omelet: ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్.. ఆరోగ్యానికి ఏది బెస్ట్! Gongura Pachadi: గోంగూర పచ్చడి ఇలా చేశారంటే ముద్ద అన్నం కూడా వదిలిపెట్టరు... అందులోకైతే అదిరిపోయే కాంబినేషన్ ..!! Cooking Tips: చపాతీలు గట్టిగా వస్తున్నాయా? ఈ చిన్న చిట్కాతో దూది లాంటి మెత్తటి 'lలేయర్ చపాతీలు మీ సొంతం! Vankaya Royyala Curry: వంకాయ ఎండు రొయ్యల కూర.. ఈ చిట్కాతో వండితే బిర్యానీ కూడా దిగదుడుపే! Gongura Chicken: నోరూరించే గోంగూర చికెన్.. ఈ కొలతలతో చేస్తే ముక్కకి పులుపు పట్టి గ్రేవీ అదిరిపోతుంది! ఇలా ఒకసారి ట్రై చేయండి..!! Plum Cake: నోరూరించే ప్లం కేక్.. ఇంట్లోనే బేకరీ స్టైల్ రుచితో.. ఇలా ఒక్కసారి ట్రై చేయండి..!! Andhra Style Nalla Karam: అమ్మమ్మల కాలం నాటి నల్ల కారం ఒకసారి ఇలా ట్రై చేయండి.. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుంటే ఓహో అనాల్సిందే..!!

Mushroom Curry: రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ..వంట రాని వారు కూడా అద్భుతంగా చేయొచ్చు..ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ లొట్టలేసుకుంటూ తింటారు..!!

హోటల్ రుచితో మష్రూమ్ గ్రేవీ కర్రీని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో తెలుసుకోండి మరి. జీడిపప్పు, కొబ్బరి మసాలాతో అద్భుతమైన రుచినిచ్చే వంటకం తయారీ విధానం మీకోసమే.

Published : 2026-02-05 09:40:00

చాలామందికి రెస్టారెంట్లలో లభించే ఆ చిక్కటి, సువాసనభరితమైన మష్రూమ్ గ్రేవీ అంటే ఎంతో మక్కువ. కానీ అదే రుచిని ఇంట్లో తీసుకురావడం సాధ్యమేనా అంటే.. ఖచ్చితంగా సాధ్యమే  ఎటువంటి ఖరీదైన ఇంగ్రిడియంట్స్ వాడకుండా, మన వంటింట్లో అందుబాటులో ఉండే వస్తువులతోనే అచ్చం హోటల్ రుచిని తలపించేలా మష్రూమ్ కర్రీని ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకోండి మరి..

కావలసిన  పదార్థాలు

ఈ కర్రీ తయారీకి 200 గ్రాముల తాజా పుట్టగొడుగులు  వీటితో పాటు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్, మరియు సాధారణ పోపు దినుసులు అవసరం. గ్రేవీకి అసలైన చిక్కదనాన్ని ఇచ్చేందుకు జీడిపప్పు, పచ్చి కొబ్బరి, టమాటా మరియు పెరుగును సిద్ధం చేసుకోవాలి.

మసాలా తయారీ విధానం

ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అర ఇంచు దాల్చిన చెక్క, రెండు యాలకులు, నాలుగు లవంగాలు వేయాలి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, పావు ముక్క పచ్చి కొబ్బరి, ఒక మీడియం సైజు టమాటా మరియు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు చేర్చి వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా ముద్దే కూరకు  అద్భుతమైన రుచిని ఇస్తుంది.

తొలుత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. గ్రేవీ కూరలకు నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు మరియు జీలకర్ర వేసి వేయించాలి. అనంతరం సన్నగా తరిగిన ఉల్లి తరుగును వేసి, అది గోధుమ రంగులోకి మారి నూనె తేలేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే గ్రేవీకి అంత మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

వంటలో అసలైన ఘట్టం ఇక్కడే మొదలవుతుంది. వేగుతున్న ఉల్లిపాయల్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసి, మంటను చిన్నగా ఉంచి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఆపై ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మసాలాలను నూనెలో మగ్గనివ్వాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న మష్రూమ్ ముక్కలను వేసి రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి. దీనివల్ల మసాలాలన్నీ ముక్కలకు బాగా పడతాయి. చివరిగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, గ్రేవీ చిక్కదనానికి తగినట్లుగా ముప్పావు కప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికిస్తే నూనె పైకి తేలి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో కూర సిద్ధమవుతుంది. కొత్తిమీర లేదా కసూరి మేతితో గార్నిష్ చేస్తే ఆ సువాసన ఇల్లంతా అలుముతుంది చూడండి ఆవాసరికి ఓహో అనాల్సిందే.

ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీ కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో వాడే కొబ్బరి, జీడిపప్పు గ్రేవీకి మంచి క్రీమీ టెక్స్చర్‌ను ఇస్తాయి. బిర్యానీ, చపాతీ లేదా వేడివేడి అన్నంతో ఈ కర్రీని వడ్డిస్తే ఇంట్లో అందరూ ఫిదా అవ్వాల్సిందే. అతి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో రెస్టారెంట్ ఫీల్ ఇచ్చే ఈ వంటకాన్ని మీరు కూడా తప్పక ప్రయత్నించండి

Spotlight

Read More →