దీపావళి వేడుకల ఎఫెక్ట్.. విమాన రాకపోకలకు అంతరాయం!
IndiGo Flight Diverted to Bengaluru: దీపావళి వేడుకల్లో భాగంగా ప్రజలు పెద్ద ఎత్తున టపాసులు కాల్చడంతో వెలువడిన పొగ విమాన రాకపోకలకు అంతరాయం కలిగించింది. గాలిలో పొగ దట్టంగా వ్యాపించడంతో విమానాశ్రయం పరిసరాల్లో దృశ్యమానత తగ్గిపోయింది. దీంతో రాయ్‌పూర్ నుంచి చెన్నైకి వస్తున్న ఇండిగో విమానాన్ని పైలట్ ముందుజాగ్రత్త చర్యగా బెంగళూరుకు మళ్లించారు. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో విమానంలో ఉన్న 78 మంది ప్రయాణికులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత విమానం తిరిగి చెన్నై చేరుకుంది.
దీపావళి టపాసుల పొగతో విమానానికి అంతరాయం.. చెన్నై వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ బెంగళూరుకు మళ్లింపు..
చెన్నై విమానాశ్రయంలో 900 మీటర్లకే పడిపోయిన విజిబిలిటీ.. ఇండిగో విమానం దారి మళ్లింపు,,
చెన్నై: దీపావళి వేడుకల్లో భాగంగా ప్రజలు పెద్ద ఎత్తున టపాసులు కాల్చడంతో వెలువడిన పొగ విమాన రాకపోకలకు అంతరాయం కలిగించింది. గాలిలో పొగ దట్టంగా వ్యాపించడంతో విమానాశ్రయం పరిసరాల్లో విజిబిలిటీ తగ్గిపోయింది. దీంతో రాయ్‌పూర్ నుంచి చెన్నైకి వస్తున్న ఇండిగో విమానాన్ని పైలట్ ముందుజాగ్రత్త చర్యగా బెంగళూరుకు మళ్లించారు. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో విమానంలో ఉన్న 78 మంది ప్రయాణికులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత విమానం తిరిగి చెన్నై చేరుకుంది.
చెన్నైలో ల్యాండింగ్‌కు అనుమతించని దృశ్యమానత
వివరాల్లోకి వెళ్తే.. ఇండిగోకు చెందిన 6E2002 విమానం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి చెన్నైకి బయలుదేరింది. ఈ విమానం ఆదివారం రాత్రి 10.45 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే దీపావళి సందర్భంగా టపాసులు కాల్చడం వల్ల వెలువడిన పొగ విమానాశ్రయ పరిసరాల్లో వ్యాపించింది. దీంతో రన్‌వేపై విజిబిలిటీ తగ్గిపోయింది. విమానం చెన్నైలో దిగేందుకు ప్రయత్నించిన సమయంలో పరిస్థితులను గమనించిన పైలట్.. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా విజిబిలిటీ లేదని గుర్తించారు. దీంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విమానాన్ని బెంగళూరుకు మళ్లించాలని నిర్ణయించారు.
950 మీటర్లు ఉండాల్సిన చోట 900 మీటర్లే!
చెన్నై విమానాశ్రయ అధికారుల సమాచారం ప్రకారం.. రన్‌వే 07పై విమానం సురక్షితంగా ల్యాండ్ కావడానికి కనీస రన్‌వే విజువల్ రేంజ్ (RVR) 950 మీటర్లు ఉండాలి. కానీ విమానం చేరుకునే సమయానికి విజిబిలిటీ సుమారు 900 మీటర్లకు పడిపోయింది. అంటే నిర్దేశిత కనీస పరిమితి కంటే 50 మీటర్లు తక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో ల్యాండింగ్ చేయడం సురక్షితం కాదని భావించిన పైలట్ రాత్రి 11.15 గంటలకు విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. VT-ILJ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ఈ విమానంలో మొత్తం 78 మంది ప్రయాణికులు ఉన్నారు.
తెల్లవారుజామున తిరిగి చెన్నైకి చేరిక
బెంగళూరుకు మళ్లించిన విమానం అక్కడి నుంచి తిరిగి చెన్నైకి బయలుదేరింది. చివరకు మంగళవారం తెల్లవారుజామున 1.54 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకుంది. విజిబిలిటీ తగ్గినప్పటికీ, కొద్ది నిమిషాల్లోనే పరిస్థితులు మెరుగుపడటంతో అదే సమయంలో ఇతర విమానాలు యథావిధిగా టేకాఫ్, ల్యాండింగ్ చేశాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు స్పందిస్తూ.. విమానాన్ని బెంగళూరుకు మళ్లించడం పూర్తిగా పైలట్ తీసుకున్న ముందుజాగ్రత్త నిర్ణయమని వెల్లడించారు. విమానం ల్యాండింగ్ సమయంలో ఉన్న విజిబిలిటీ పరిస్థితుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
సాధారణంగా విమాన ప్రయాణాల్లో వాతావరణ పరిస్థితులు, రన్‌వేపై విజిబిలిటీకి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని నిమిషాల పాటు విజిబిలిటీ తగ్గినా విమానాల ల్యాండింగ్‌పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పైలట్ తీసుకున్న నిర్ణయం వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానం సురక్షితంగా తిరిగి చెన్నై చేరుకుంది.
Tags
Be the first to react