AP Driving School: ఏపీలో జాతీయ స్థాయి డ్రైవింగ్ స్కూల్ మళ్లీ పునఃప్రారంభం! సీఎం ఆదేశాలు..!

2025-12-12 09:55:00
Free Electricity: ఏపీలో వారికి గుడ్‌న్యూస్! ఇకపై ఉచితంగానే... ఒక్కొక్కరికి రూ.6 వేల నుంచి రూ.10 వేలు వరకు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకాశం జిల్లా దర్శిలో దేశంలోనే రెండో జాతీయ స్థాయి డ్రైవింగ్, ట్రైనింగ్, రీసెర్చ్ స్కూల్‌ను మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమైంది. 2016లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పిల్లర్ల దశలోనే ఆగిపోయింది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పనులు మళ్లీ చురుకుగా జరగనున్నాయి. ఈ స్కూల్ పూర్తి అయితే యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

TTD Updates: తిరుమలలో భక్తులకు శుభవార్త! ఆ మెషిన్‌లో స్కాన్ చేసి ఇలా చేస్తే ఉచితంగా డబ్బులు.. !

2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో 20 ఎకరాల స్థలంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. రూ.18.50 కోట్ల నిధులతో మారుతీ సుజుకి సహకారంతో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించబడింది. భారీ, తేలికపాటి వాహనాల నడపడంలో ప్రతి సంవత్సరం వెయ్యి మందికి శిక్షణ, అలాగే 14,500 డ్రైవర్లకు రిఫ్రెషర్ కోర్సులు ఇవ్వడం ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం. అంతేకాకుండా 4,000 మందికి ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించనున్నారు.

New Railwayline: ఏపీలో కొత్త రైల్వే లైన్.. ట్రయల్ రన్ విజయవంతం! ఎన్నో ఏళ్ల కల..

డ్రైవింగ్ స్కూల్‌లో పురుషులు, మహిళా డ్రైవర్లకు వేర్వేరుగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం 70%, రాష్ట్ర ప్రభుత్వం 30% నిధులు మంజూరు చేస్తుంది. లాభాపేక్ష లేకుండా మారుతీ సుజుకి నిర్మాణ బాధ్యతలు చేపట్టనుంది. కానీ రాజకీయ, పరిపాలనా కారణాల వల్ల 2016 తర్వాత పనులు ముందుకు సాగలేదు.

India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య చర్చలు వేగం అవుతున్నాయని వెల్లడించిన మంత్రి పీయూష్ గోయల్!!

ఇప్పటి వరకు కేవలం ట్రాక్ కోసం కొండ ప్రాంతం చదును చేయడం, పరిపాలనా భవనం పిల్లర్లు నిర్మించడం వంటి పనులు మాత్రమే జరిగాయి. గత ప్రభుత్వ కాలంలో రూ.2.5 కోట్లు కేటాయించినప్పటికీ, పనిచేసిన మొత్తము సుమారు రూ.50 లక్షలకే పరిమితమైంది. ఈ నిలిచిపోయిన పనులను తిరిగి వేగవంతం చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది.

Akhanda2 Review: అఖండ 2 రివ్యూ.. బాలయ్య 'తాండవం'! మాస్ బ్లాక్‌బస్టర్ వైబ్స్!

రోడ్డు ప్రమాదాల నివారణపై ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు డ్రైవింగ్ స్కూల్‌ను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కేలా అవకాశాలు మెరుగుపడ్డాయి. ప్రభుత్వం త్వరలోనే పూర్తి ప్రణాళికను ప్రకటించనుంది. ఈ స్కూల్ ప్రారంభమైతే దర్శి ప్రాంతానికి అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

US Immigration: ట్రంప్ గోల్డ్ కార్డు నిర్ణయం! విదేశీ విద్యార్థులకు 5 ఏళ్ల అమెరికా పౌరసత్వం!
Road Accident: అల్లూరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం! 15 మందికి పైగా మృతి!
Cucumber: వీళ్లు కీర దోసకాయ అస్సలు తినకూడదు! ఎందుకో తెలుసా!
AP Government: ఏపీ ఉద్యోగులకు శుభవార్త! ఇక ఆ సమస్యలుండవు... హైలెవెల్ కమిటీ ఏర్పాటు!
Visakhapatnam: రేపు విశాఖలో సత్వా వాంటేజ్‌తో పాటు మరో 7 ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్!

Spotlight

Read More →