తిరుపతిలో ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం... ORR సర్వే ప్రారంభం!

2025-12-11 08:53:00
US Visa Update: అమెరికా వీసా స్లాట్లపై బిగ్ షాక్! అపాయింట్‌మెంట్‌లు ఆగిపోయిన అసలు కారణం ఇదే!

తిరుపతిలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి తుడా పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుండటం, నగర జనాభా వేగంగా పెరుగుతుండటం వల్ల సమగ్ర రవాణా ప్రణాళిక అవసరమైంది. ఈ నేపథ్యంలో నగరానికి వెలుపలుగా, సుమారు 90 కిలోమీటర్ల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.

Praja Vedika: నేడు (11/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి స్వయంగా అధికారులతో కలిసి రోడ్డుకు సంబంధించిన ప్రాథమిక సర్వే నిర్వహించారు. నగర భవిష్యత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి ట్రాఫిక్ నిర్వహణను సులభతరం చేయడానికి ఈ రింగ్ రోడ్ ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ రోడ్డు నగరం చుట్టూ గ్రామీణ, చంద్రగిరి, రేణిగుంట వంటి ముఖ్య మండలాలను కలుపుతూ సాగనుంది.

AP Employees: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు.. త్వరలోనే..

గతంలో వైకుంఠమాల పేరుతో వచ్చిన ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదన కొన్ని కారణాల వల్ల ముందుకు సాగలేదు. ప్రస్తుతం అదే ప్రతిపాదనను తుడా మళ్లీ పరిశీలిస్తూ, ప్రభుత్వ భూములను ఎక్కువగా వినియోగించి భూసేకరణ ఖర్చులను తగ్గించే కొత్త ప్రణాళికను రూపొందిస్తోంది. దీంతో నిర్మాణ వ్యయం తగ్గడంతో పాటు, నిర్మాణ వేగం కూడా పెరిగే అవకాశం ఉంది.

సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు

ప్లాన్ అమల్లోకి వచ్చిన తర్వాత తిరుపతి గ్రామీణ, చంద్రగిరి, రామచంద్రాపురం, రేణిగుంట, వడమాలపేట మండలాలు ఈ రింగ్ రోడ్డుతో అనుసంధానమవుతాయి. వడమాలపేట నుంచి నారావారిపల్లి, కల్యాణి డ్యామ్, జూపార్క్, అలిపిరి, కరకంబాడి ప్రాంతాల మీదుగా రింగ్ రోడ్ వెళ్లేలా ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ మేరకు పూర్తి ఖరారు వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ!

ఈ ప్రాజెక్టు పూర్తయితే తిరుపతిలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. నగరంలోకి ప్రవేశించే మరియు నగరం విడిచి వెళ్లే వాహనాలు నేరుగా ఔటర్ రింగ్ రోడ్డును వినియోగించుకోవచ్చు. దీనివల్ల తిరుమలకు వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సులభమవుతుందని, నగర చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థికాభివృద్ధి కూడా వేగవంతం అవుతుందని అధికారులు ఆశిస్తున్నారు.

AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..!
AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు!
Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు
Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!!
Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల!

Spotlight

Read More →