విశాఖపట్నం ఐటీ రంగం విస్తరణకు శుక్రవారం అత్యంత ప్రాధాన్యమైన రోజుగా నిలవబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన టెక్నాలజీ–ఇన్నోవేషన్ దిశకు పెద్ద ఊతమివ్వనున్న పెట్టుబడులు, క్యాంపస్‌లు, భవిష్యత్ ఉపాధి అవకాశాల నేపథ్యంలో విశాఖ మరోసారి జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ సంస్థ సత్వా గ్రూప్ విశాఖ మధురవాడ హిల్–4లో నిర్మించనున్న భారీ సత్వా వాంటేజ్ వైజాగ్ క్యాంపస్ కు శుక్రవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు పరిశ్రమ ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
30 ఎకరాల్లో రూపుదిద్దుకోనున్న ఈ మెగా ప్రాజెక్ట్
రూ .1,500 కోట్ల పెట్టుబడి 25వేల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. అదనంగా, 40 నుండి 50 వేలకు పైగా మంది పరోక్షంగా ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న వేళ ఈ పెట్టుబడి విశాఖ ఐటీ హబ్ ప్రాధాన్యాన్ని మరింత పెంచనుంది.
సత్వా క్యాంపస్‌లో ప్రపంచ స్థాయి గ్రేడ్–A కార్యాలయాలు, ప్రీమియం నివాసాలు, ఇంటిగ్రేటెడ్ రిటైల్ & హాస్పిటాలిటీ హబ్, స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్ సదుపాయాలు, పునరుత్పత్తి శక్తి సమీకరణతో కూడిన ఆధునిక మౌలిక వసతులు ఏర్పాటు చెయ్యనున్నారు. పట్టణ జీవన ప్రమాణాలకు అనుగుణంగా ESG–ఆధారిత నిర్మాణం చేపడతామని సంస్థ ప్రకటించింది.
విశాఖలో మరో 7 ఐటీ సంస్థలకు శుక్రవారం శంకుస్థాపన
సత్వా వాంటేజ్ క్యాంపస్‌తో పాటు విశాఖలో మరో ఏడు ఐటీ కంపెనీల క్యాంపస్‌లకు కూడా మంత్రి నారా లోకేష్ శిలాఫలకాలు ఆవిష్కరించనున్నారు. ఈ పెట్టుబడులు మొత్తం విశాఖను గ్లోబల్ టెక్నాలజీ సెంటర్‌గా తీర్చిదిద్దే దిశగా కీలక పాత్ర పోషించనున్నాయి.
1. టెక్ తమ్మిన (Tech Tammina / Sree Tammina Software Solutions Pvt. Ltd.)
స్థలం: మధురవాడ SPL–4, హిల్–2
పెట్టుబడి: రూ.62 కోట్లు
ఉద్యోగాలు: 500
అమెరికా, నెదర్లాండ్స్, దుబాయ్ వంటి దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ విశాఖలో విస్తరణకు సిద్ధమవుతోంది.
2. నాన్ రెల్ టెక్నాలజీస్ (Nonrel Technologies Pvt. Ltd.)
స్థలం: విశాఖ NON–IT SEZ, హిల్–2
పెట్టుబడి: రూ.50.60 కోట్లు
ఉద్యోగాలు: 567
3. ఏసీఎన్ హెల్త్‌కేర్ RCM సర్వీసెస్ (ACN HealthCare RCM Services Pvt. Ltd.)
స్థలం: ఐటీ SEZ, హిల్–2
పెట్టుబడి: రూ.30 కోట్లు
ఉద్యోగాలు: 600
ఈ సంస్థ 12 నెలల్లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించనుంది.
4. ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ (Imaginnovate Techsolutions India Pvt. Ltd.)
స్థలం: కాపులుప్పాడ, భీమిలి
పెట్టుబడి: రూ.140 కోట్లు
ఉద్యోగాలు: 2,600
5. ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ (Fluentgrid Limited)
స్థలం: కాపులుప్పాడ
పెట్టుబడి: రూ.150 కోట్లు
ఉద్యోగాలు: 2,000
6. మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (Motherson Technology Services Ltd.)
స్థలం: కాపులుప్పాడ ఐటీ పార్క్ ఫేజ్–1
పెట్టుబడి: రూ.109.73 కోట్లు
ఉద్యోగాలు: 1,775
7. క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (Quarks Technosoft Pvt. Ltd.)
స్థలం: కాపులుప్పాడ
పెట్టుబడి: రూ.115 కోట్లు
ఉద్యోగాలు: 2,000
విశాఖపట్నం టెక్నాలజీ, ఇన్నోవేషన్, డిజిటల్ ఎంటర్‌ప్రైజ్‌లకు కేంద్రబిందువుగా మారుతున్న నేపథ్యంలో ఈ పెట్టుబడులు నగరం భవిష్యత్ వృద్ధికి మలుపుతిప్పనున్నాయి. సత్వా, కాగ్నిజెంట్, మరియు ఏడు ఐటీ సంస్థల భూమిపూజతో శుక్రవారం విశాఖలో ఐటీ రంగం కొత్త అధ్యాయాన్ని ఆరంభించనుందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.