ఇల్లు అంటే ఒక అద్భుతమైన కల అందులో నివసించాలి అంటే ప్రతిదే మనకు నచ్చేలా ఉండాలి. ఆరోగ్యం, ప్రశాంతత అన్నీ ఆ ఇంటి వాతావరణంతో ముడిపడి ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి గది ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుంది. సాధారణంగా మనం లివింగ్ రూమ్, బెడ్ రూమ్ లేదా వంటగదిపై ఎక్కువ శ్రద్ధ చూపుతాం. కానీ బాత్రూమ్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటాం. నిజానికి బాత్రూమ్ కూడా ఇంటి శక్తి సమతుల్యతపై ప్రభావం చూపించే ముఖ్యమైన భాగమే అని వాస్తు నిపుణులు తెలుపుతున్నారు.
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం బాత్రూమ్‌లో నెగటివ్ (Bathroom Mirror Vastu) ఎనర్జీ ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే అక్కడ అమర్చే ప్రతి వస్తువును జాగ్రత్తగా ఎంపిక చేయాలి. ముఖ్యంగా అద్దం స్థానం, దిశ, ఆకారం వంటి అంశాలు మన జీవితంపై అనుకోని ప్రభావాన్ని చూపుతాయని చెబుతారు. చిన్నగా కనిపించే అద్దమే కుటుంబంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక ఒత్తిడికి కారణమవుతుందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది.
మొదటిగా అద్దం దిశ గురించి తెలుసుకోవాలి. బాత్రూమ్ (Bathroom Mirror) తలుపు తెరిచిన వెంటనే అద్దంలో మన ప్రతిబింబం పడేలా ఉంచడం మంచిది కాదని వాస్తు చెబుతోంది. ఇలా ఉంటే ఇంట్లోకి ప్రతికూల శక్తి మరింత పెరుగుతుందని నమ్మకం. అందుకే అద్దాన్ని తలుపుకు ఎదురుగా కాకుండా, ఉత్తరం లేదా తూర్పు గోడలపై అమర్చడం శుభప్రదంగా భావిస్తారు. ఈ దిశల్లో అద్దం ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి, ఇంట్లో శాంతి వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు.
అద్దం ఆకారానికీ వాస్తులో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. బాత్రూమ్‌లో వృత్తాకార అద్దాల కంటే చతురస్రం లేదా దీర్ఘచతురస్ర ఆకారంలో ఉన్న అద్దాలు మంచివిగా భావిస్తారు. ఈ ఆకారాలు మన ఆలోచనల్లో స్థిరత్వాన్ని పెంచుతాయని, కుటుంబ సభ్యుల మధ్య అవగాహనను మెరుగుపరుస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అద్దం అంచులు గుచ్చుకునేలా లేదా వంకరగా ఉండకుండా చూడటం కూడా చాలా ముఖ్యం.
చాలా ఇళ్లలో పగిలిన అద్దాలు లేదా మూలల్లో చీలికలు వచ్చిన అద్దాలను అలాగే వాడుతుంటారు. కానీ ఇది పెద్ద తప్పు అని జ్యోతిష్య శాస్త్రం హెచ్చరిస్తోంది. విరిగిన లేదా చీలిన అద్దాలు ఇంట్లో మానసిక అశాంతిని, ఒత్తిడిని పెంచుతాయని నమ్మకం. (Telugu Vastu News) అలాగే అద్దం మీద మచ్చలు, మురికి ఉండటం కూడా శుభకరం కాదని చెబుతారు. అద్దం ఎప్పుడూ శుభ్రంగా, స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి.
అద్దం ఎత్తు కూడా ముఖ్యమైన అంశమే. చాలా తక్కువ ఎత్తులో అద్దం ఉంటే మన పూర్తి ప్రతిబింబం సరిగ్గా కనిపించదు. అద్దంలో చూసుకునేప్పుడు తల భాగం స్పష్టంగా కనిపించేలా సరైన ఎత్తులో అమర్చుకోవాలి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నా (Positive Energy) లేదా బాత్రూమ్ రీమోడలింగ్ చేస్తున్నా, వాస్తు విషయంలో సందేహాలు ఉంటే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అద్దం సరిగ్గా ఉంచడం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తగ్గి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని నమ్మకం. అద్దం కేవలం ప్రతిబింబాన్ని చూపే వస్తువు మాత్రమే కాదు, అది ఇంటి శక్తిని ప్రతిబింబించే సాధనమని వాస్తు శాస్త్రం చెబుతోంది. చిన్న మార్పులు చేసుకుంటే జీవితంలో పెద్ద మార్పులు రావచ్చని నిపుణులు సూచిస్తున్నారు.