Repalle: ప్రత్యేక అవసరాల పిల్లలకు అండగా ‘స్వర్ణ భవిత’ కేంద్రాలు.. రేపల్లెలో రూ.29.30 లక్షలతో నూతన వనరుల కేంద్రం ప్రారంభం!
Repalle: ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు, థెరపీ, పునరావాసం ఒకే చోట అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ‘స్వర్ణ భవిత’ వనరుల కేంద్రాలు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు.
రేపల్లెలో రూ.29.30 లక్షలతో స్వర్ణ భవిత కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అనగాని సత్య ప్రసాద్..
ప్రత్యేక అవసరాల పిల్లలకు నాణ్యమైన విద్య, థెరపీ సేవలే లక్ష్యం..
రేపల్లె: ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు, థెరపీ, పునరావాసం ఒకే చోట అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ‘స్వర్ణ భవిత’ వనరుల కేంద్రాలు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు.
శుక్రవారం బాపట్ల జిల్లా రేపల్లె మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో రూ.29.30 లక్షల వ్యయంతో నిర్మించిన ‘స్వర్ణ భవిత’ ప్రత్యేక అవసరాల పిల్లల వనరుల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తో కలిసి మంత్రి ప్రారంభించారు.
కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి అక్కడ ఏర్పాటు చేసిన వివిధ గదులు, సౌకర్యాలను పరిశీలించారు. కేంద్రంలో విద్యనభ్యసిస్తున్న ప్రత్యేక అవసరాల చిన్నారులను ఆప్యాయంగా పలకరించి, వారి అభ్యాసం, అవసరాల గురించి తెలుసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులతో సమావేశమై వారి సమస్యలు, సూచనలను వినిపించుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాల పిల్లలు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. నాణ్యమైన విద్యతో పాటు వైద్య సేవలు, థెరపీ, పునరావాస సదుపాయాలు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణ భవిత కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ప్రతి చిన్నారిలో ఉన్న ప్రత్యేక ప్రతిభను గుర్తించి, వారి భవిష్యత్తును మెరుగుపరిచే బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందని పేర్కొన్నారు. అందరూ సమన్వయంతో పనిచేస్తే ఈ పిల్లలు కూడా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆయన అన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాల పిల్లలకు అవసరమైన విద్యా, వైద్య, థెరపీ సేవలను సమగ్రంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. స్వర్ణ భవిత కేంద్రంలో నిపుణుల సేవలు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బి. శ్రీదేవి, డీఐఓ కోదండరామ్, డీఈఓ శ్రీనివాస్ సింగ్, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు అవసరమైన సేవలను ఒకే వేదికపై అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ స్వర్ణ భవిత వనరుల కేంద్రాలు మరింత బలం చేకూరుస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags
Be the first to react