⚡ BREAKING

Machilipatnam: మచిలీపట్నంలో ఘనంగా ‘హర్ గర్ తిరంగా’ ర్యాలీ.. 100 అడుగుల భారీ జెండాతో విద్యార్థుల సందడి!

Machilipatnam: దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ మచిలీపట్నంలో ‘హర్ గర్ తిరంగా’ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో 100 అడుగుల భారీ జాతీయ జెండాతో నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Machilipatnam
Machilipatnam

బందరులో 100 అడుగుల జాతీయ జెండా ర్యాలీ.. ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర..

‘హర్ గర్ తిరంగా’తో మచిలీపట్నంలో దేశభక్తి వెల్లువ.. విద్యార్థులతో భారీ ర్యాలీ..

మచిలీపట్నం: దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ మచిలీపట్నంలో ‘హర్ గర్ తిరంగా’ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో 100 అడుగుల భారీ జాతీయ జెండాతో నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కుంచె దుర్గాప్రసాద్‌తో పాటు పలువురు నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. దశాబ్దాల పాటు సాగిన పోరాటం, వేలాది మంది స్వాతంత్ర్య సమరయోధుల ప్రాణత్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న ప్రతి పౌరుడు ఆ మహనీయుల త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని సూచించారు.

దేశ సమగ్రత కోసం ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు భాగస్వామ్యం అందించాలని అన్నారు.

మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి ఎందరో మహనీయులు దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాన్ని మంత్రి గుర్తు చేశారు. వారి త్యాగాలు, దేశభక్తి భావనలను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుల పోరాట గాథలను భవిష్యత్ తరాలకు కూడా వివరించాలని సూచించారు. స్వాతంత్ర్య విలువను అర్థం చేసుకుని దేశ అభివృద్ధి, సమైక్యత కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు.

ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారీ జాతీయ జెండాతో సాగిన ‘హర్ గర్ తిరంగా’ ర్యాలీ మచిలీపట్నంలో దేశభక్తి వాతావరణాన్ని నింపింది.

Tags

Be the first to react

Latest