APSRTC: ఆర్టీసీ అధికారులతో ఐకాస కీలక చర్చలు.. ఈ-బస్సులు, ఖాళీ పోస్టుల భర్తీపై ప్రధాన డిమాండ్లు!

APSRTC: విజయవాడలోని ఆర్టీసీ హౌస్లో ఆర్టీసీ యాజమాన్యం, ఐకాస (జాయింట్ యాక్షన్ కమిటీ) నాయకుల మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, సంస్థ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.

APSRTC
APSRTC

ఈ-బస్సుల కొనుగోలు ఆర్టీసీ ద్వారానే జరపాలి.. ఐకాస విజ్ఞప్తి..

'స్త్రీ శక్తి' పథకానికి మరిన్ని బస్సులు.. ఆర్టీసీ అధికారులకు ఐకాస వినతి..

విజయవాడలోని ఆర్టీసీ హౌస్లో ఆర్టీసీ యాజమాన్యం, ఐకాస (జాయింట్ యాక్షన్ కమిటీ) నాయకుల మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, సంస్థ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఐకాస నేతలతో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) బ్రహ్మానందరెడ్డి, ఈడీ (ఇంజనీరింగ్) వర్మ, ఈడీ (ఆపరేషన్స్) నాగేశ్వరరావు సమావేశమై వివిధ డిమాండ్లపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం చర్చల వివరాలను స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆర్టీసీ ఎండీకి నివేదించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా విద్యుత్ బస్సుల కొనుగోలు ప్రక్రియను పూర్తిగా ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని ఐకాస నేతలు కోరారు. అలాగే ఈ-బస్సుల నిర్వహణ బాధ్యతలను కూడా ఆర్టీసీ సిబ్బందికే అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న 'స్త్రీ శక్తి' పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలంటే అవసరమైన మేరకు బస్సుల సంఖ్యను పెంచాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాటు సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి, సేవలను మరింత మెరుగుపరచాలని కోరారు.

మొత్తంగా సుమారు 30 డిమాండ్లను ఐకాస ప్రతినిధులు ఆర్టీసీ అధికారుల ముందుంచారు. ఈ డిమాండ్లపై యాజమాన్యం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags

Be the first to react

Latest