Nimmala Ramanaidu: అమరావతి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కేంద్రబిందువు.. జగన్ వైఖరిపై మంత్రి నిమ్మల విమర్శలు!
Nimmala Ramanaidu: అమరావతి రాజధానిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి విషయంలో వైఎస్సార్సీపీ నేతలు ఒక్కోరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని, వారి వ్యాఖ్యల్లో స్పష్టత కనిపించడం లేదన్నారు.
అమరావతి లక్ష కోట్ల ఆదాయం తెచ్చే సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని: నిమ్మల..
అధికారంలోకి వచ్చాక అమరావతిపై మాట మార్చారు: మంత్రి నిమ్మల..
పాలకొల్లు: అమరావతి రాజధానిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి విషయంలో వైఎస్సార్సీపీ నేతలు ఒక్కోరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని, వారి వ్యాఖ్యల్లో స్పష్టత కనిపించడం లేదన్నారు.
గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ అసెంబ్లీలో అమరావతికి పూర్తి మద్దతు ప్రకటించారని, రాజధానికి 30 వేల ఎకరాల భూమి అవసరమని, తాను కూడా అక్కడే ఇల్లు నిర్మించుకుంటానని చెప్పారని మంత్రి గుర్తు చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని, ఐదేళ్ల పాలనలో ఒక్క రాజధానినైనా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన అసెంబ్లీ, సచివాలయం నుంచే ఐదేళ్లు పాలన సాగించారని పేర్కొన్నారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమరావతిని స్వయం సమృద్ధి కలిగిన "సెల్ఫ్ ఫైనాన్స్" రాజధానిగా అభివృద్ధి చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ రాజధాని ద్వారా లక్ష కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయని, రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరిగేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. బెంగళూరు కర్ణాటకకు, చెన్నై తమిళనాడుకు, హైదరాబాద్ తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నట్లే, భవిష్యత్తులో అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక శక్తిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
అమరావతి అంశంపై వైఎస్సార్సీపీ నాయకులు రోజుకో విధంగా మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. ఒకరు ఒక రాజధాని, మరొకరు మూడు రాజధానులు, ఇంకొందరు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి విభిన్న వ్యాఖ్యలు ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయని అన్నారు.
2019 ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకి తీవ్ర పరాజయం చవిచూపించి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా తీర్పు ఇచ్చారని మంత్రి నిమ్మల వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ప్రజల తీర్పును గౌరవించకుండా రాష్ట్రంలో ప్రతికూల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని, పెట్టుబడులు, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువస్తున్నారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ స్వరాజ్యంపై దృష్టి సారిస్తుండగా, మంత్రి నారా లోకేష్ విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంటే, ప్రతిపక్షం మాత్రం విమర్శలు, వివాదాలతో ముందుకు సాగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
Tags
Be the first to react