ఈగోలు పక్కనపెట్టి ప్రజా సేవకు ప్రాధాన్యం ఇవ్వాలి: సీఎం చంద్రబాబు
అమరావతిలో జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాలన, నాయకత్వం, తాగునీరు, గృహ నిర్మాణం, జీఎస్‌డీపీ, అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు. ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులు, సంస్కరణలను ఆయన ప్రస్తావించారు.
జిల్లా కలెక్టర్లు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఈగోలకు తావులేకుండా ప్రజా సేవకులుగా పనిచేయాలని కలెక్టర్లకు పిలుపునిచ్చారు
అమరావతిలో జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాలన, నాయకత్వం, తాగునీరు, గృహ నిర్మాణం, జీఎస్‌డీపీ, అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు. ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులు, సంస్కరణలను ఆయన ప్రస్తావించారు.
పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి సాధించిన విజయాలు మంత్రులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల సమిష్టి కృషి ఫలితమని పేర్కొన్నారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా, నాణ్యంగా అందేలా ప్రో-యాక్టివ్ గవర్నెన్స్‌ను అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. టెక్నాలజీ వినియోగంతో నిర్ణయాలు వేగంగా తీసుకోవాలని అన్నారు.
ఇదిలా ఉండగా, ఏపీ రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Be the first to react