⚡ BREAKING

చంద్రబాబు అరెస్టును గుర్తుచేస్తూ సౌదీలో టీడీపీ శ్రేణుల నిరసన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ సౌదీ అరేబియాలో టీడీపీ శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాయి. ‘నిజం గెలిచింది.. నీతి నిలిచింది’ పేరుతో రియాధ్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

NRI Saudi

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జానీ బాషా, రాజశేఖర్ ఆధ్వర్యంలో 53 కొవ్వొత్తులను వెలిగించారు. చంద్రబాబు అరెస్టు ఘటనను పార్టీ శ్రేణులు తీవ్రంగా ప్రస్తావిస్తూ, ఆ ఘటన తమకు బాధాకరమైన సందర్భమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెన్నుపాటి నరేశ్, గుత్తా వెంకటరావు, సత్యశ్రీనివాస్, ముజ్జమ్మీల్ షేక్, పోకూరి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Be the first to react

Latest