⚡ BREAKING

కృష్ణా జలాల వివాదం: ఏపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

కృష్ణా నదీ జలాల పంపకాల అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపకాలపై నెలకొన్న వివాదానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేసింది

Krishna river
Krishna river

కృష్ణా నదీ జలాల పంపకాల అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపకాలపై నెలకొన్న వివాదానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేసింది.

కృష్ణా పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాలకు నీటి కేటాయింపులకు సంబంధించిన గత ట్రైబ్యునల్ నిర్ణయాలతో పాటు, ప్రస్తుత ట్రైబ్యునల్ విధివిధానాలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన గెజిట్‌ను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏపీ అభ్యర్థనను పరిశీలించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబర్ 13న చేపట్టనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

Tags

Be the first to react

Latest