ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మద్యం సేవించే వారికి ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. మద్యం విక్రయాలు, ధరలపై కీలక మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాల వల్ల సాధారణ మద్యం ధరలు పెరగనుండగా, ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఏర్పడింది. సంక్రాంతి పండుగ సీజన్‌కు ముందు ఈ మార్పులు రావడంతో (Liquor Prices) మందుబాబుల్లో చర్చ మొదలైంది. మద్యం కొనాలంటే ఇకపై జేబు మరింత ఖాళీ కావాల్సిందే అన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇప్పటి వరకు బార్లు, మద్యం దుకాణాలకు ప్రభుత్వం సరఫరా చేసే మద్యం ధరలు, వినియోగదారులకు విక్రయించే ధరల మధ్య వ్యత్యాసం ఉండేది. దీనికి కారణంగా అమలులో ఉన్న అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ టాక్స్ కీలక పాత్ర పోషించేది. (Excise Policy Andhra Pradesh) తాజా నిర్ణయంతో ఆ పన్నును రద్దు చేస్తూ ప్రభుత్వం ఒకవైపు ధరల సమానత్వం తీసుకువచ్చింది. అయితే అదే సమయంలో ప్రభుత్వ ఆదాయం తగ్గకుండా ఉండేందుకు మద్యం సీసాలపై ధర పెంపు నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులన్నీ ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందాయి.
ప్రభుత్వ నిర్ణయం (AP Government Decision) ప్రకారం, మద్యం దుకాణాల లైసెన్సీలకు ఇచ్చే మార్జిన్‌ను ఒక శాతం పెంచారు. దీని వల్ల షాపుల యజమానులకు కొంత లాభం చేకూరనుంది. అయితే ఈ మార్జిన్ పెంపుతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు ప్రతి మద్యం సీసాపై రూ.10 చొప్పున ధర పెంచాలని నిర్ణయించారు. ఈ ధర పెంపు వల్ల రాష్ట్ర ఖజానాకు సుమారు రూ.1,391 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. అదే సమయంలో ఏఆర్‌ఈటీ రద్దు కారణంగా సుమారు రూ.340 కోట్ల మేర ఆదాయం తగ్గే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా ప్రభుత్వం (Wine Shops Andhra Pradesh) గతంలో ప్రవేశపెట్టిన రూ.99 క్వార్టర్ మద్యం ధరను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. తక్కువ ఆదాయం ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే బీర్ ధరలపై కూడా ఎలాంటి పెంపు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైన్‌తో పాటు రెడీ టు డ్రింక్స్ విభాగానికీ మినహాయింపు ఇచ్చింది. దీంతో సాధారణ మద్యం సేవించే వారికి కొంత ఊరట లభించినట్టే అయినా, ఇతర మద్యం రకాల ధరలు పెరగడం వల్ల మొత్తం మీద ఖర్చు పెరుగుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇంకొక కీలక నిర్ణయంగా, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధికి బయట ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న త్రీస్టార్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి హోటళ్లలో మైక్రో బ్రూవరీలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల కొత్త పెట్టుబడులు రావడంతో పాటు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. గత ప్రభుత్వ కాలంలో బార్లపై (Bar Liquor Rates) విధించిన అదనపు పన్నులను తొలగిస్తూ, ధరల విధానాన్ని సరళీకృతం చేయడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.