ఫ్రాన్స్‌లో జరగబోయే జీ7 సదస్సు (G7 Summit) తేదీలు మారడానికి అసలు కారణం ఏమిటన్నది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) హాజరు కావడం అత్యంత కీలకమని భావించిన కారణంగానే ఈ తేదీల్లో మార్పు జరిగిందని వైట్ హౌస్ స్పష్టం చేసింది. మొదట జూన్ 14 నుంచి 16 వరకు జీ7 సదస్సును నిర్వహించాలని ఫ్రాన్స్ నిర్ణయించినప్పటికీ, తర్వాత దాన్ని జూన్ 15 నుంచి 17కి మార్చింది. ఈ మార్పు వెనుక అమెరికా అధ్యక్షుడి షెడ్యూల్ ప్రధాన కారణమని అమెరికా ఉన్నతాధికారులు వెల్లడించారు. జీ7 సదస్సుకు ట్రంప్ హాజరు కావడం అవసరమని సభ్య దేశాలు భావించాయని తెలిపారు.
వాస్తవానికి జూన్ 14న ట్రంప్ వైట్ హౌస్‌లో (US Politics) ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అదే రోజున ఆయన 80వ పుట్టినరోజు కూడా కావడం గమనార్హం. ఈ సందర్భంగా మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ట్రంప్ షెడ్యూల్‌కు ఇబ్బంది కలగకుండా జీ7 తేదీలను మార్చేందుకు ఫ్రాన్స్ అంగీకరించిందని తెలుస్తుంది. అమెరికా అధ్యక్షుడి హాజరు లేకుండా జీ7 సదస్సు పూర్తిస్థాయిలో జరగదన్న అభిప్రాయం భాగస్వామ్య దేశాల్లో ఉందని (White House) వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
ఇదే విషయంపై ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం కూడా స్పందించింది. అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ (Emmanuel Macron) కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, జీ7లోని అన్ని భాగస్వామ్య దేశాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తేదీల్లో మార్పు చేశామని పేర్కొంది. ఇది ఏ ఒక్క దేశానికి ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయం కాదని, సభ్య దేశాల సమిష్టి అభిప్రాయంతోనే తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేసింది. జీ7 వంటి కీలక అంతర్జాతీయ సదస్సుల్లో సభ్య దేశాల నాయకుల హాజరు చాలా ముఖ్యమని ఫ్రాన్స్ అభిప్రాయపడింది.
జీ7 అనేది ప్రపంచంలోని (International Relations) ఏడు ప్రధాన ఆర్థిక శక్తుల సమాఖ్య. ఇందులో బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ మరియు అమెరికా దేశాలు సభ్యులుగా (Global Summit,) ఉన్నాయి. ఈ దేశాలు ప్రతీ ఏడాది మారుతూ నాయకత్వ బాధ్యతలు చేపట్టి సదస్సులు, మంత్రుల స్థాయి సమావేశాలను నిర్వహిస్తుంటాయి. ఈసారి సదస్సుకు G7 నాయకులు అందరూ హాజరయ్యేలా చూసుకోవడమే (France) ఫ్రాన్స్ లక్ష్యమని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే వేదిక కావడంతో, జీ7లో అమెరికా అధ్యక్షుడి పాత్ర ఎంతో ప్రభావవంతమని వారు అభిప్రాయపడుతున్నారు.