Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం!

TTD: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..! శ్రీవాణి టికెట్లపై టీటీడీ కొత్త రూల్స్..!

 తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో గణనీయమైన మార్పులు చే

Published : 2026-01-10 17:40:00
Plane Crash: రూర్కేలా–భువనేశ్వర్ ఫ్లైట్‌కు షాక్..! కన్సార్ వద్ద కూలిన విమానం!

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో గణనీయమైన మార్పులు చేస్తూ, ఇప్పటివరకు అమలులో ఉన్న ఆఫ్‌లైన్ టికెట్ల జారీని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితికి చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. జనవరి 9వ తేదీ నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు.

Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు!

ఇప్పటివరకు తిరుమలలో రోజుకు ఆఫ్‌లైన్ విధానంలో జారీ చేస్తున్న 800 శ్రీవాణి దర్శన టికెట్లను ఇకపై పూర్తిగా ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఈ టికెట్లు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల అవుతాయి. ఫస్ట్ కమ్ – ఫస్ట్ సర్వ్ పద్ధతిలో మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు తిరుమలలో దర్శనానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా క్యూలైన్లు తగ్గడమే కాకుండా భక్తులకు సమయపరమైన సౌలభ్యం కూడా కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్!

శ్రీవాణి దర్శన టికెట్ల దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు టీటీడీ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. టికెట్ బుకింగ్ సమయంలో ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ ధృవీకరణ తప్పనిసరిగా చేయాలని స్పష్టం చేసింది. ఒక కుటుంబం నుంచి గరిష్ఠంగా నలుగురు (1+3) మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ కొత్త విధానాన్ని తొలుత నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆ తర్వాత భక్తుల స్పందన ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని టీటీడీ అధికారులు తెలిపారు.

Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ!

ఈ మార్పులతో పాటు ఇప్పటికే అమలులో ఉన్న కొన్ని శ్రీవాణి దర్శన టికెట్ విధానాలు యథాతథంగా కొనసాగుతాయని టీటీడీ స్పష్టం చేసింది. మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో జారీ చేస్తున్న 500 శ్రీవాణి అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు, అలాగే తిరుపతి విమానాశ్రయంలో రోజూ ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్న 200 టికెట్లు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. భక్తులు ఈ కొత్త మార్పులను గమనించి, ముందస్తుగా తమ దర్శన ప్రణాళికలను సక్రమంగా రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఈ నిర్ణయంతో తిరుమలలో దర్శన వ్యవస్థ మరింత పారదర్శకంగా, సులభంగా మారుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు!
Sankranthi: సన్నాయి మేళాలు మౌనం.. డూడూ బసవన్నలకు దూరమవుతున్న జనం!
ఏపీ మీదుగా మూడు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు - రూట్ ఇదే.! ప్రయాణికులకు రైల్వే శాఖ సంక్రాంతి కానుక!
మెరిసేదంతా బంగారమేనా? ఇది బంగారు భూమి! కడుపు నిండా పసిడి నిక్షేపాలే.. ఎక్కడ తవ్వినా గుట్టలు గుట్టలుగా..
PhonePe Bolt: వీసా–మాస్టర్‌కార్డ్‌కు గుడ్ న్యూస్! ఒక్క క్లిక్‌తో కార్డ్ పేమెంట్స్..!
Ticket rates: ఐబొమ్మ రవి అరెస్టు.. టికెట్ రేట్ల పెంపు.. నారాయణ సంచలన వ్యాఖ్యలు!

Spotlight

Read More →