ప్రపంచంలో బంగారం అంటే విలువ, భద్రత, సంపదకు ప్రతీకగా భావిస్తారు. కానీ కొన్ని దేశాల్లో పరిస్థితులు తలకిందులుగా ఉంటాయి. అలాంటి దేశాల్లో ఒకటి వెనిజులా (Venezuela) భారత్‌లో బంగారం ధరలు రోజురోజుకీ ఆకాశాన్ని తాకుతున్న వేళ, వెనిజులాలో (Venezuela Gold Price) మాత్రం 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం గ్రాము ధర కేవలం కొన్ని వందల రూపాయలకే లభించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది వినడానికి ఆనందంగా అనిపించినా, వాస్తవానికి ఇది ఆ దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి (Venezuela Economic Crisis) స్పష్టమైన నిదర్శనం.
భారతదేశంలో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల మార్క్‌ను దాటిపోయింది. త్వరలోనే ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ వెనిజులాలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ స్థానిక కరెన్సీ (Currency Collapse) విలువ భారీగా పడిపోవడంతో, బంగారం ధరలు రూపాయల్లో లెక్కిస్తే అతి తక్కువగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఒకటే అయినా, కరెన్సీ విలువ క్షీణత కారణంగా వెనిజులాలో బంగారం చౌకగా అనిపిస్తుంది.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం వెనిజులా ఆర్థిక వ్యవస్థ పతనం. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ అస్థిరత, తప్పు విధానాలు, అవినీతి, అంతర్జాతీయ ఆంక్షలు కలిసి దేశాన్ని కుదేలు చేశాయి. ముఖ్యంగా అమెరికాతో ఏర్పడిన విభేదాలు ఈ దేశంపై తీవ్ర ప్రభావం చూపాయి. డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) పాలనలో అమెరికా అమెరికా ఫస్ట్ విధానాన్ని గట్టిగా అమలు చేయడం వల్ల వెనిజులాపై ఆంక్షలు మరింత కఠినంగా మారాయి. దీని ప్రభావంతో చమురు ఎగుమతులు తగ్గిపోయి, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గింది.
వెనిజులా ఒకప్పుడు ప్రపంచంలోనే (Natural Resources Crisis) అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. భూమి కింద అపారమైన సహజ వనరులు ఉన్నప్పటికీ, వాటిని సక్రమంగా వినియోగించుకోలేకపోయింది. దేశంలోని ఒరినోకో మైనింగ్ ప్రాంతంలో (Gold Reserves) బంగారం, వజ్రాలు, ఇతర ఖనిజాలు విరివిగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ ప్రజలకు కనీస అవసరాలు కూడా అందని పరిస్థితి నెలకొంది. నిత్యావసర వస్తువుల కొరత, పెరుగుతున్న నిరుద్యోగం, ఆహార కొరత ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.
వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మదురో (Nicolas Maduro) పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందనే విమర్శలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వ ఖర్చులు, అప్పులు తీర్చేందుకు బంగారు నిల్వలను విదేశాలకు తరలించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో దేశంలో అధికారికంగా ఉన్న బంగారం నిల్వలు క్రమంగా తగ్గిపోయాయి. మరోవైపు, స్థానిక కరెన్సీ అయిన బొలివర్ విలువ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పడిపోయింది. దీని ఫలితంగా ప్రజల చేతిలో ఉన్న డబ్బుకు విలువ లేకుండా పోయింది.
ఈ మొత్తం పరిస్థితిని చూస్తే, వెనిజులాలో బంగారం చౌకగా దొరుకుతుందన్న వార్త వెనుక ఉన్న నిజం స్పష్టంగా అర్థమవుతుంది. అది సంపదకు సంకేతం కాదు, సంక్షోభానికి ప్రతిబింబం మాత్రమే. సహజ వనరులు ఎంత ఉన్నా, సరైన పాలన, స్థిరమైన విధానాలు లేకపోతే దేశం ఎలా కష్టాల్లో కూరుకుపోతుందో వెనిజులా (South America Economy) ఉదాహరణగా నిలుస్తోంది. అందుకే ప్రపంచ దేశాలు ఈ దేశ పరిస్థితిని గమనిస్తున్నాయి. బంగారం, చమురు వంటి సంపదలు ఉన్నా, ప్రజల జీవితాలు మాత్రం ఇంకా వెలుగులు చూడని వాస్తవం వెనిజులాలో నేటికీ కొనసాగుతోంది.