Storm effect : తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తిరుపతి జిల్లాలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు! Cyclone Ditwah: శ్రీలంకలో డిట్‌వా తుఫాన్‌ విధ్వంసం.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం!! Ditva Cyclone: ఏపీపై దిత్వా పంజా… వచ్చే 48 గంటలు కీలకం! ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ! Cold winds: చలిగాలులు విస్తరించనున్నాయి.. తెలంగాణలో 30 వరకు ఉష్ణోగ్రతల పతనం! Cyclone Ditwah:దిత్వా తుపానుపై రాష్ట్రం అలెర్ట్… ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి అనిత అత్యవసర సూచనలు!! Cyclone Ditva: భారీ వరదలు.. శ్రీలంకలో 123 మంది మృతి.. దిత్వా తుఫాను ప్రభావం! Hospital: కేజీహెచ్‌లో భారీ అగ్ని ప్రమాదం! కార్డియాలజీ విభాగం పొగమంచులో మునిగింది! Ditwah Cyclone: దూసుకొస్తున్న దిత్వా తుపాను! నేడు ఆ జిల్లాల్లో ఎడతెరపలేని వానలు! తీవ్ర రూపం దాల్చిన దిత్వా తుపాను.. ఏపీలో అత్యంత భారీ వర్షాలు! గంటకు 90 కిలోమీటర్ల వేగంతో.. Rain Alert: ఏపీకి దిత్వా తుఫాన్ ముప్పు! రానున్న ఐదు రోజులు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు! Storm effect : తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తిరుపతి జిల్లాలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు! Cyclone Ditwah: శ్రీలంకలో డిట్‌వా తుఫాన్‌ విధ్వంసం.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం!! Ditva Cyclone: ఏపీపై దిత్వా పంజా… వచ్చే 48 గంటలు కీలకం! ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ! Cold winds: చలిగాలులు విస్తరించనున్నాయి.. తెలంగాణలో 30 వరకు ఉష్ణోగ్రతల పతనం! Cyclone Ditwah:దిత్వా తుపానుపై రాష్ట్రం అలెర్ట్… ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి అనిత అత్యవసర సూచనలు!! Cyclone Ditva: భారీ వరదలు.. శ్రీలంకలో 123 మంది మృతి.. దిత్వా తుఫాను ప్రభావం! Hospital: కేజీహెచ్‌లో భారీ అగ్ని ప్రమాదం! కార్డియాలజీ విభాగం పొగమంచులో మునిగింది! Ditwah Cyclone: దూసుకొస్తున్న దిత్వా తుపాను! నేడు ఆ జిల్లాల్లో ఎడతెరపలేని వానలు! తీవ్ర రూపం దాల్చిన దిత్వా తుపాను.. ఏపీలో అత్యంత భారీ వర్షాలు! గంటకు 90 కిలోమీటర్ల వేగంతో.. Rain Alert: ఏపీకి దిత్వా తుఫాన్ ముప్పు! రానున్న ఐదు రోజులు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!

Cyclone Ditwah: శ్రీలంకలో డిట్‌వా తుఫాన్‌ విధ్వంసం.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం!!

2025-11-29 19:37:00
Passport Lost: విదేశాల్లో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నారా? భయపడకండి! తీసుకోవాల్సిన తక్షణ చర్యలు ఇవే!

శ్రీలంకలో  వర్షాలు, వరదలు వలన పరిస్థితులు రోజురోజుకూ విషమిస్తున్నాయి. డిట్‌వా తుఫాన్ ప్రభావంతో దాదాపు వారం రోజులుగా కొనసాగుతున్న భారీ వర్షాలకు  ఇప్పటికే 132 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగినది. మరో 176 మంది కనిపించకుండా పోయినట్లు అధికారికంగా నిర్ధారించడంతో ఆ దేశం అంతటా ఆందోళన నెలకొంది. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ విపత్తు నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించి అంతర్జాతీయ  సహాయం కోరింది.

Farmers: రైతులకు గుడ్‌న్యూస్.. ఆ భూములు కూడా రిజిస్టర్ చేసుకునే అవకాశం! రుసుములన్నీ మాఫీ!

డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్ వెల్లడించిన వివరాల ప్రకారం, 15,000కిపైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సురక్షిత ప్రదేశాలకు తరలించబడిన వారు మాత్రమే 78,000 మందికి చేరుకున్నారు. విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో దేశంలోని సుమారు మూడోవంతు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నీటి శుద్ధి కేంద్రాల్లోకి వరదనీరు చేరడంతో తాగునీటి కొరత మరింత తీవ్రమైంది. అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు కూడా దెబ్బతిన్నాయి.

Akhanda: జర్మనీలో బాలయ్య హవా! ఫ్యాన్ టికెట్‌కు ఏకంగా ₹1 లక్ష రూపాయలు...!

అత్యవసర చట్టాలను అమల్లోకి తెచ్చిన అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే, సైన్యం, నౌకాదళం, వైమానిక దళాన్ని పూర్తి స్థాయిలో రక్షణ చర్యలకు వినియోగించాలని ఆదేశించారు. అనురాధపురం జిల్లాలో చిక్కుకుపోయిన 69 మంది బస్సు ప్రయాణికులను రక్షించేందుకు సైన్యం 24 గంటలపాటు సాగిన ఆపరేషన్‌ నిర్వహించింది. హెలికాప్టర్‌తో ప్రయత్నించగా గాలివాన  కారణంగా మొదటి ప్రయత్నం విఫలమైనప్పటికీ, చివరకు నౌకాదళ పడవల సాయంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

IIM Bangalore:ఇంటర్మీడియట్ తర్వాతే IIM బెంగళూరులో చదువు అవకాశం… అండర్‌గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కొత్త మార్గం!!

బదుల్లా, కాండీ వంటి మధ్య ప్రాంతాలు పూర్తిగా వరద ముంపులో చిక్కుకుపోయాయి. నేలచరియలతో రహదారులు తెగిపోవడం వల్ల పలు గ్రామాలు బయట ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. మస్పన్న గ్రామానికి చెందిన స్థానికుడు సమన్ కుమార మాట్లాడుతూ‌ గ్రామం మొత్తం నీటిలో మునిగిపోయింది. బయటకు వెళ్లే దారి లేదు. శుద్ధ నీరు కూడా దొరకడం లేదు అని ఆవేదనను వ్యక్తపరిచారు.

Gold and silver: బంగారం, వెండి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి.. 24K గోల్డ్ 1.29 లక్షలు దాటింది!

ఇదిలా ఉంటే తుఫాన్‌ నేటికీ (శనివారం)  శ్రీలంకను దాటి ఉత్తర దిశగా కదిలి భారత్ వైపు సాగుతోంది. చెన్నైలో ముందస్తు హెచ్చరికలతో 54 విమానాల రద్దు, పలు ప్రాంతాల్లో పాఠశాలలు మూసివేత వంటి చర్యలు తీసుకున్నారు.

Ditva Cyclone: ఏపీపై దిత్వా పంజా… వచ్చే 48 గంటలు కీలకం! ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!

శ్రీలంక కోరిన అత్యవసర సహాయానికి భారత్ తొలుత స్పందించింది. కోలంబోలో ఉన్న భారత నౌకాదళ నౌక తన వద్ద ఉన్న రేషన్‌ను వరద బాధితులకు అందించగా, రెండు విమానాల నిండా సహాయక సామగ్రిని భారత్ పంపింది. ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతి వ్యక్తం చేస్తూ అవసరమైతే ఇంకా సహాయం అందించేందుకు సిద్ధమని ప్రకటించారు.

Pakistan Border: పాక్‌ సరిహద్దులో భారతీయుడు అరెస్ట్! 100 రోజుల తర్వాత వెలుగులోకి..!

డిట్‌వా తుఫాన్‌ ప్రభావం 2017 తర్వాత శ్రీలంక ఎదుర్కొంటున్న అత్యంత భారీ ప్రకృతి విపత్తుగా నమోదైంది. అప్పట్లో వరదలు, భూకంపాలు 200 మందికి పైగా ప్రాణాలు తీసిన విషయం ఇంకా ప్రజల మదిలో ఉంది. ఇప్పుడు అదే భయంకర దృశ్యాలు తిరిగి ఉత్పన్నమవుతున్నాయి. వర్షాలు కాస్త తగ్గినప్పటికీ, ఇంకా ఉత్తర ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా స్థిరపడలేదు. అధికార యంత్రాంగం సహాయక చర్యలు వేగవంతం చేస్తుండగా దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర అస్థిరత, అనిశ్చితిలో  ఉన్నారు.

Cyber Security: సిమ్ లేకుండా మెసేజింగ్ యాప్ యాక్సెస్‌కు నో! సైబర్ మోసాలకు చెక్!
Sleeper buses: భద్రతా ప్రమాణాలు లేకుండా నడిచే స్లీపర్ బస్సులు వెంటనే నిలిపివేయాలి... NHRC!
Indian Railways: చిన్న వ్యాపారాలకు శుభవార్త! పార్సిల్ సర్వీస్‌పై రైల్వే కీలక నిర్ణయం...

Spotlight

Read More →